*వేములపల్లి మండలం బుగ్గబావి గూడెం గ్రామవాసులు కేతనపల్లి శ్రీనివాస్ రెడ్డి, నిమ్మల వెంకట్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో 100 మంది కాంగ్రెస్, సి.పి.ఎం పార్టీలకు రాజీనామా చేసి బీ.ఆర్.ఎస్ లో చేరిక*
*కండువా కప్పి పార్టీ లోనికి స్వాగతించిన ఎమ్మెల్యే*
వేములపల్లి ప్రజాలహరి
వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం గ్రామవాసులు కేతనపల్లి శ్రీనివాస్ రెడ్డి, నిమ్మల వెంకట్ రెడ్డి గార్ల తో పాటు మరో 100 మంది కాంగ్రెస్, సి.పి.ఎం పార్టీలకు చెందిన కార్యకర్తలు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేములపల్లి మండల బి.ఆర్.ఎస్ పార్టీ అద్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ అనిరెడ్డి నాగలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి గార్ల అద్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారి సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు, వారిని ఎమ్మెల్యే గారు గులాబీ కండువా కప్పి పార్టీ లోనికి స్వాగతించారు, చేరిన వారిలో (చిలుముల వసంత్ రెడ్డి, గుండ్ల సతీష్, కడారి సతీష్, మాచనబోయిన రమేశ్, మోదుగు రామలింగం, పట్టేటి సోములు, నిమ్మల కిరణ్ కుమార్ రెడ్డి, రాంరెడ్డి, వెంకట్ రెడ్డి, వెంకట్ రెడ్డి, విద్యా సాగర్ రెడ్డి, జానకి రాంరెడ్డి,) తదితరులు ఉన్నారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలు ప్రజా సంక్షేమం కోసం సి.ఏం కె.సి.ఆర్ గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు అని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది, కే.సీ.ఆర్ గారు ప్రవేశపెట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల ద్వారా బుగ్గబావిగూడెం గ్రామానికి ఇప్పటి వరకు 11 కోట్ల 84 లక్షల 88 వేల 420 రూపాయలు మంజూరు అయ్యాయి అని తెలిపారు..ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్, బి.ఆర్.ఎస్ నాయకులు ఇరుగు వెంకటయ్య, గ్రామ శాఖ అద్యక్షులు పుట్ట గురువయ్య, మాలి శంకర్ రెడ్డి, అమిరెడ్డి శేఖర్ రెడ్డి, అలుగుబెల్లి పుల్లారావు, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, పుట్ట కరుణాకర్, ఇసరం కరుణాకర్, కంచర్ల సాయి, మాచనబోయిన వెంకన్న తదితరులు పాల్గొన్నారు..