2014లో ఎన్నికలకు ముందు ఇదే జూనియర్ కాలేజీ వేదికగా పేట ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన
దశాబ్దాలుగా వేధిస్తున్న సాగు తాగునీటి సమస్యల నుండి పేట ప్రజలకు విముక్తి కల్పించాం
ఎవరూ కలలో కనని విధంగా ఐ.టి హబ్ వచ్చింది
కెసిఆర్ దర్శనికత , కేటీఆర్ కు విదేశాల్లో ఉన్న పలుకుబడడే ఐటి హబ్ రావడానికి కారణం
సూర్యాపేట నియోజకవర్గంలో రూ. 7,500 కోట్లతో అభివృద్ధి.
భారత దేశంలో ఐటీ మంత్రి అంటే వినపడే పేరే కేటీఆర్.
తెలంగాణలోనే పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తుంది కేటీఆర్ వల్లే.
పట్టణంలో 40 ఏళ్లుగా జరగని రోడ్డు విస్తరణ పనులు చేపట్టి సుందరంగా అభివృద్ధి.
త్వరలోనే స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభించు కుందాం.
పుల్లారెడ్డి చెరువు ట్యాంక్ బండ్, జమ్మిగడ్ద వరకు రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేసిన కెటిఆర్ కు కృత్ఞతలు
*సూర్యాపేట*ప్రజాలహరి..
సీఎం కేసీఆర్ దార్శనికతకు తోడుగా ఐటీ రంగంలో కేటీఆర్ కు ఉన్న పలుకుబడే రాష్ట్రం లో సూర్యాపేట వంటి పట్టణాలకు ఐటీ హాభ్ లను తీసుకొచ్చిందని సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో ఐటీ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ఐటీ మంత్రి అంటేనే వినపడే పేరు కేటీఆర్ అని అన్నారు. ఐటీ ,పారిశ్రామిక రంగంలో కేటీఆర్ కు ఉన్న అపారమైన మెదస్సుతోనే పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామంగా నిలిచిందన్నారు. దేశంలో ఏ ఒక్కరూ పరిశ్రమ పెట్టాలన్న తెలంగాణ వైపు మాత్రమే చూస్తున్నారని , దానికి కారణం కేటీఆర్ అని కొనియాడారు. ఐటిరంగంలో కేటీఆర్ కు ఉన్న పట్టుతోనే ఆ రంగంలో కర్ణాటకను తలదన్ని దేశంలోనే హైదరాబాద్ అగ్రస్థానానికి చేరిందన్నారు. సూర్యాపేటలో కూడా 200 మందితో ప్రారంభించుకున్న ఐటీ పరిశ్రమను రాబోయే మూడేళ్లలో 5000 మందికి విస్తరిస్తామని పేర్కొన్నారు. పురపాలక శాఖ మంత్రి హోదాలో పట్టణ పరిశుభ్రతపై కేటీఆర్ కున్న అవగాహనతోనే ఎక్కడా లేనివిధంగా ప్రతి పట్టణంలో సివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు, ఎప్పుడూ వినని ఫీకల్ స్లెడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు వెలుస్తున్నాయి అన్నారు. పట్టణాల్లో పార్కులు, పరిశుభ్రమైన వాతావరణం, అద్దాలను తలపించే రహదారుల నిర్మాణం కేటీఆర్ విజన్ తోనే సాధ్యపడిందన్నారు. దశాబ్దాలుగా సూర్యాపేట ప్రజలను వేధించిన సాగు తాగునీటి సమస్యల నుండి విముక్తి కల్పించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ దే అన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఇదే జూనియర్ కాలేజీ వేదికగా సూర్యాపేట ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు మంత్రి తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్, అడగగానే నిధులు ఇచ్చిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో 7500 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినామన్నారు. చెప్పినవే కాకుండా సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మెడికల్ కాలేజ్ ని కూడా ఏర్పాటు చేసుకున్నామన్నారు. త్వరలోనే ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి కూడా నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. 40 ఏళ్లుగా సూర్యాపేట పట్టణంలో జరుగని రోడ్డు విస్తరణ పనుల కోసం అడగగానే 25 కోట్లు మంజూరు చేసిన కేటీఆర్ వల్లే విశాలమైన రహదారులను విస్తరించుకోగలిగామని అన్నారు. గతంలో బోటు ను చూడాలంటే కేరళనో, హైదరాబాద్ కు వెళ్లాల్సిన వచ్చిన పట్టణవాసులకు సద్దుల చెరువు ట్యాంక్ బండ్, అక్కడ ఏర్పాటు చేసిన బోటింగ్ లతో సూర్యాపేటలోనే అహ్లాద వాతావరణం తీసుకొచ్చామన్నారు. త్వరలోనే పుల్లారెడ్డి చెరువు ట్యాంక్బండ్ పనులతో పాటు, లక్ష్మీ థియేటర్ వద్ద ఉన్న బ్రిడ్జి ను ఆధునికరించి, లక్ష్మీ థియేటర్ నుండి జమ్మిగడ్డ వరకు రహదారులను విస్తరిస్తామన్నారు. అందుకుగాను అడిగిన వెంటనే 30 కోట్లు మంజూరు చేసిన కేటీఆర్ గారికి సూర్యాపేట ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. పాలనలో కెసిఆర్ దార్శనికతకు తోడు, కేటీఆర్ సంకల్పంతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టాయన్నారు. ఆడపడుచులకు కానుకగా ఇస్తున్న కల్యాణ లక్ష్మి పథకానికి నామకరణం చేసింది కూడా కేటీఆర్ అని తెలిపారు. సూర్యాపేటలో జరుగుతున్న అభివృద్ధి ఆరంభం మాత్రమే అని తెలిపిన మంత్రి ,రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయి పట్టణంగా సూర్యాపేటను తీర్చి దిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ కు అండగా ఉండి జరుగుతున్న అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.