
*ఘనంగా గాంధీ 154 వ జయంతి వేడుకలు*
మిర్యాలగూడ ప్రజాలహరి…
జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్ నందు గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు , మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి …ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సత్యం, అహింసలే ఆయుధాలుగా భారత స్వరాజ్య సంగ్రామ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికిన మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. వారు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, నవభారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు… కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా మాజీ అద్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్నాటి రమేశ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అద్యక్షులు గౌరు శ్రీనివాస్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బోగవెల్లి వెంకట రమణ చౌదరి(బాబి), రైస్ మిల్లర్స్ పాల్గొన్నారు…