*సూర్యాపేటలో ఐటీ హబ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్*
ప్రజాలహరి,
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్‌ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ కంపెనీల ప్రతినిధులతో, ఉద్యోగాలు పొందిన యువతతో మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి ముచ్చటించారు.
ఐటీ హబ్‌లో గాంధీజీ చిత్రపటానికి కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.