అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని స్థానిక రాజీవ్ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జాతిపిత శ్రీ మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది
ఈ కార్యక్రమాని ఉద్దేశించి ముఖ్యఅతిథిలుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ భత్తుల లక్ష్మారెడ్డి గారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ గాంధీజీ స్వాతంత్రోద్యమంలో ప్రధాన పాత్రను పోషించి అహింస సత్యాగ్రహం అనే రెండు ఆయుధాలను మన దేశ ప్రజలకు పరిచయం చేసిన గొప్ప నాయకుడు వాటితోనే ఆంగ్లేయులను తరిమికొట్టి మన స్వరాజ్య ఆకాంక్ష ను నెరవేర్చి మనల్ని స్వతంత్రులను చేసిన మహోన్నత వ్యక్తి మన మహాత్మా గాంధీ గారు వీరు ప్రపంచ దేశ నాయకులందరికీ ఆదర్శప్రాయుడై ప్రపంచ నాయకులు వీరి బాటలో నడిచే విధంగా మన దేశ ఖ్యాతిని పెంపొందించిన మహోన్నత వ్యక్తి మన గాంధీజీ వీరి పుట్టినరోజును అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పరిగణిస్తున్నారంటే వీరి ఖ్యాతి ఎల్లలు దాటి మన దేశ పౌరులు అందరూ తలలు ఎత్తుకునేలా వీరు మన దేశ ఖ్యాతిని పెంచారు అనడంలో సందేహమే లేదు కుల మతాలను అన్నింటినీ ఒకటిగా చేసి ప్రజలు ఎలాంటి సమస్యలు లేకుండా జీవించేలా చొరవ తీసుకున్న మొట్టమొదటి మహోన్నత వ్యక్తి మన గాంధీజీ వారిని మన భారత జాతికే పితామహుడిలా అభివర్ణిస్తూ మన జాతిపిత అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అంటే అదివారు మన దేశ ప్రజల కోసం చేసినటువంటి త్యాగాలు ఎవరు కూడా మరువలేనివని వారిని ఆదర్శంగా తీసుకుంటూ మనము మన భావితరాల వారు ఇంకా ముందుకు సాగిపోతూ ఉండాలని వారన్నారు
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమడబోయిన అర్జున్, పోధిల శ్రీనివాస్, జిల్లా జనరల్ సెక్రటరీ చిలుకూరు బాలు, జిల్లా ఉపాధ్యక్షులు నాగు నాయక్, బెజ్జం సాయి కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి గంధం రామకృష్ణ కొమ్మన నాగలక్ష్మి గుంజ చంద్రకళ శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు హజార్ ఉపాధ్యక్షుడు సిద్దు నాయక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి జగ్గారెడ్డి బసవయ్య ఇజ్రాయిల్ గుండు నరేందర్ సారథి శంకర్ రెడ్డి శరత్ అంబటి వెంకటకృష్ణ అమృతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు