Ultimate magazine theme for WordPress.

24 గంటలు విద్యుత్తు దగా మంత్రి జగదీశ్ రెడ్డి రాజీనామా చేయాలి

Post top

*కరెంటు లేక నీళ్లు అందక పంట పొలాలు ఎండిపోతున్న పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం  విద్యుత్ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని పదవి నుండి వెంటనే రాజీనామా చేయాలి.

సామాజికవేత్త మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి గారు.

 

ఈరోజు దామరచర్ల మండలం KJR కాలనీ సబ్స్టేషన్ ముందు ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జం సాయి మరియు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ధనవత్ సిద్దు నాయక్ ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సామాజికవేత్త మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి  మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నమ్మి 24 గంటలు వస్తుందని పంటలు వేసుకోవడం జరిగింది. గతంలో ఇప్పుడున్న నీటిమట్టం ఉంటే నీటిని విడుదల చేశారు.మరి ఇప్పుడెందుకు చేయరు?. భూగర్భ జలాలు ఇంకిపోయి కొద్ది కొద్దిగా నీళ్లు వస్తున్నాయి మోటర్లు కేమో కరెంటు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం రైతులకు సరిపడా 24 కరెంటు ఇస్తామని ,కనీసం 12 నుంచి 15 గంటలు కరెంటు ఇవ్వట్లేదు. రైతే రాజు అని ఈ ప్రభుత్వం గొప్పలు చెబుతుంది కానీ తీరా చేతలకు వస్తే మాత్రం శూన్యం. తక్షణమే 24 గంటల కరెంటు ఇచ్చి రైతులను ఆదుకొని పంటలు ఎండిపోకుండా చూడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రైతులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.*

post bottom

Leave A Reply

Your email address will not be published.