ప్రముఖ సినీ నటి రాశిఖన్నా చేతుల మీదుగా సీఎంఆర్ వస్త్ర వ్యాపార ప్రారంభం… మిర్యాలగూడ ప్రజాలహరి. వస్త్ర వ్యాపార ప్రపంచంలో సీఎంఆర్ తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్తుంది. ఈరోజు మిర్యాలగూడ వ్యాపార కేంద్రంలో నూతన సీఎంఆర్ షాపింగ్ మాల్ ను ప్రముఖ సినీ నటి రాశి ఖన్నా, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర రావు చేతుల మీదుగా ప్రారంభం కావడం జరిగింది. సినీ నటి రాశి ఖన్నా కారులో సిఎంఆర్ షాపింగ్ మాల్ వద్దకు రాగానే అభిమానులు ,ప్రజలు కొలహాలతో అర్షద్వానాలు తో స్వాగతం పలికారు. ఆమె కారు పైనుంచి ప్రజలకు విష్ చేస్తూ చిరునవ్వులతో పలకరించింది .అనంతరం వ్యాపార సముదాయమైన సీఎంఆర్ షాపింగ్ మాల్ ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ముందుగా సినీ నటి రాశి ఖన్నా , ఎమ్మెల్యే భాస్కరరావు, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, స్థానిక కౌన్సిలర్ శ్రీమతిచెరుపల్లి రమాదేవి, రైస్ మిల్లర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లయన్ కర్నాటి రమేష్, సిఎంఆర్ ఫౌండర్ చైర్మన్ మావూరి వెంకటరమణ, మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ ల ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. ఈ సందర్భంగా సినీనటి రాశిఖన్నా మాట్లాడుతూ తనను ఆదరించినట్లుగానే సి ఎం ఆర్ షాపింగ్ మాల్ కూడా ఆదరించాలని వారి వ్యాపార అభివృద్ధికి చేదోడుగా నిలవాలని కోరారు. ఎమ్మెల్యే భాస్కరరావు మాట్లాడుతూ మిర్యాలగూడ దిన దిన అభివృద్ధి చెందుతూ వస్త్ర రంగంలో పలు ప్రముఖ వ్యాపార వస్త్ర సముదాయాల మాల్స్ మిర్యాలగూడ కు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అదేవిధంగా అనేకమంది యువతి యువకులకు ఉపాధి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ మాట్లాడుతూ తెలంగాణలో 24 వ షో రూమ్ ను మిర్యాలగూడలో ప్రారంభించినట్లు తెలిపారు తమ కంపెనీ లాభ పేక్ష లేకుండా తక్కువ ధరలకు నాణ్యమైన వస్త్రాలు అందిస్తామని పేర్కొన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ తెలంగాణలోను మరియు ఆంధ్రాలోనూ వన్ ఆఫ్ ది బెస్ట్ గా సీఎంఆర్ వస్త్ర ప్రపంచం లో పేరుగాంచిందని తెలిపారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణం గాను 25లక్ష రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించినట్లు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.