జిల్లా ఏర్పాటులో ఉన్న ఆటంకాలెంటి:- మాజీ జెడ్పీ చైర్మన్ రవికుమార్, డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల కంటే మిర్యాలగూడకు జిల్లాగా ఏర్పటు చేసే సందర్భంలో ఉన్న ఆటంకాలు ఏంటో ప్రభుత్వం బహిర్గతం చేయాలని ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ సిడి రవికుమార్,నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ లు ప్రశ్నించారు. మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం మిర్యాలగూడలోని ఎన్టీఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటుచేసిన నిరవధిక నిరాహార దీక్షలను వారు ప్రారంభించి మాట్లాడారు. కనీస అర్హతలు,అవకాశాలు ,వనరులేని వాటిని జిల్లాగా చేశారని మిర్యాలగూడను ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రస్తుత ఎమ్మెల్యే భాస్కరరావు ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి మిర్యాలగూడ జిల్లాగా ప్రకటింపచేయకపోతే ప్రజల అగ్రహానికి గురికావాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. జిల్లా ఏర్పాటు విషయంలో ప్రస్తుత ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాబోయే రోజుల్లో అధికారంలో రానున్న కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ జిల్లాను ప్రకటిస్తుందని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న జిల్లా సాధన ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపి ఉద్యమంలో పాల్గొంటుందని పేర్కొన్నారు. జిల్లా ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం వహిస్తుందని మాజీ శాసనసభ్యులు రేపాల శ్రీనివాస్ అన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి జిల్లా ఏర్పాటు చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వం గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిలి శ్రీనివాస్, సైదులు,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి, బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోత్ దశరథ నాయక్, డాక్టర్ రాజు, ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాడుగుల శ్రీనివాస్, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నగేష్ ,జిల్లా ఉపాధ్యక్షులు జోసెఫ్,బాబురావు,మధు, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్నాల వెంకయ్య యాదవ్, జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేష్, అంజయ్య, దాశరాజు జయరాజు, సైదులు, జనయేత్రీ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ మునీర్, తదితరులు పాల్గొన్నారు.
రిలే నిరాహార దీక్షలో కూర్చున్న వారు:-
జిల్లా సాధన కోసం మిర్యాలగూడలోని ఎన్టీఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద జరిగిన మొదటి రోజు రిలే నిరాహార దీక్షలో డాక్టర్ జాడి రాజు మాడుగుల శ్రీనివాస్, నగేష్ ,జోసెఫ్, దాశరాజు జయరాజు, దుర్గయ్య,బంటు కవిత, దానావత్ ఉషా నాయక్, వజ్రగిరి అంజయ్య, తదితరులు కూర్చున్నారు.