కరెంటు కోతలను నివారించాలి
* మాజీ ఎమ్మెల్యే జూలకంటి డిమాండ్……మిర్యాలగూడ, ప్రజాలహరి
కరెంటు కోతలను నివారించాలని మాజీ ఎమ్మెల్యే చూడకండి రంగారెడ్డి కోరారు శనివారం విద్యుత్ శాఖ డీఈ వెంకటేశ్వర్లు ను కలిసి సమస్యలు వివరించారు. కరెంటు కోతలు లేకుండా నిరంతరం కరెంటు అందిస్తున్నామని ప్రభుత్వం అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని పేర్కొన్నారు. ముఖ్యంగా పంట పొలాలకు 24 గంటల కరెంటు అందడం లేదని దాని ఫలితంగా పంట పొలాలు నీళ్లు అందగా ఎండిపోతున్నాయన్నారు. బోర్లు బావులు కింద రైతులు పంటలు సాగు చేసుకున్నారని ఉచిత నిరంతర విద్యుత్ అందిస్తున్నామని చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో కనీసం 12 గంటలు కూడా కరెంటు రావడం లేదన్నారు. కేవలం ఉదయం 6 గంటలు రాత్రి ఆరు గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారని అడపాదడపా కరెంటు వచ్చి పోవడం వల్ల పంట పొలాలు కు నీళ్లు అందడం లేదన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో కరెంటు కోతలు తీవ్రంగా ఉన్నాయని లో వోల్టేజి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కరెంటు కోతను నివారించి నిరంతరంగా కరెంటు అందించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రైతులను ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సిపిఎం మండల కార్యదర్శి రవి నాయక్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాగిరెడ్డి మంగారెడ్డి, తిరుపతి రామ్మూర్తి, వరలక్ష్మి, పాల్వాయి రామ్ రెడ్డి, , ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు.