Ultimate magazine theme for WordPress.

కాంగ్రెసు ఆరు గ్యారెంటీ స్కీములు ఆరిపోయే దీపాలు… కేటీఆర్

Post top
home side top

ప్రజాలహరి ఖమ్మం…

 

 

స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ఆ ఆరు గ్యారెంటీలు ఆరిపోయే దీపాలు అని మంత్రి కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. మొండిచేయికి ఓటేస్తే 3 గంట‌క‌ల క‌రెంట్ గ్యారెంటీ, సంవ‌త్స‌రానికి ఒక ముఖ్య‌మంత్రి దిగ‌డం ఖాయం, ఆకాశం నుంచి పాతాళం వ‌ర‌కు అన్ని కుంభ‌కోణాలే. ఆ కుంభ‌కోణాల కాంగ్రెస్‌కు అవ‌కాశం ఇస్తే రాష్ట్రాన్ని దోచుకోవ‌డం ఖాయం అని కేటీఆర్ అన్నారు.రూ.50 కోట్ల‌కు పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి కొన్నాడ‌ని కాంగ్రెస్ నాయ‌కులే అంటున్నారు. కోట్ల రూపాయాల‌కు ఎమ్మెల్యే సీట్లు అమ్ముకుంటున్నార‌ని కాంగ్రెస్ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. వీళ్ల‌కు ఓటేస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటాడు. ప్ర‌జ‌లు కాంగ్రెస్ గ్యారెంటీల‌ను న‌మ్మ‌రు. ఆగం కావొద్దు.. అభివృద్ధిలో భాగం కావాలి అని ప్ర‌జ‌ల‌కు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ జ‌నాన్ని చూస్తుంటే సండ్ర వెంకట వీర‌య్య గారి గెలుపు ఖాయ‌మ‌నే ప‌రిస్థితి క‌న‌బ‌డుతుంది. స‌త్తుప‌ల్లి చైత‌న్య‌వంత‌మైన ప్రాంతం. రాజ‌కీయాల్లో పార్టీలు మార‌డం స‌హ‌జం. నిన్న‌టి దాకా కేసీఆర్ దేవుడు అని పొగిడిన‌వారే.. ఇవాళ దుర్మార్గుడు అని పేర్కొన‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు..? చైత‌న్యంతో ఆలోచించిండి. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు మాట్లాడుతూ.. కేసీఆర్ 2 వేల పెన్ష‌న్ ఇస్తే.. డ‌బుల్ ఇస్తామ‌ని అంటున్నారు. 24 గంట‌ల క‌రెంట్ ఇస్తే 48 గంట‌ల క‌రెంట్ ఇస్తామ‌ని అంటున్నారు. గ్యారెంటీ గ్యారెంటీ అని ఊద‌ర‌గొడుతూ కొత్త కొత్త డైలాగులు చెబుతున్నారు. 150 ఏండ్ల కింద పుట్టిన పార్టీ.. ఆ పార్టీ వారెంటీ ఎప్పుడో అయిపోయింది. చ‌చ్చిన పీనుగ‌లాంటి పార్టీ. ఆ పార్టీకే వారెంటీ లేదు.. మ‌రి ఆ పార్టీ నాయ‌కుల మాట‌ల‌కు గ్యారెంటీ ఉందా? ఆలోచించండి. ఆ నాయ‌కుల మాట‌ల‌కు విలువ‌లేదు. హైద‌రాబాద్‌లో క‌మాండ్, బెంగ‌ళూరులో న్యూక‌మాండ్, ఢిల్లీలో హైక‌మాండ్ ఉంది. ఒక‌టి మాట ఒక‌రు విన‌రు. హామీల‌కు పొంత‌న ఉండ‌దు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, మ‌హాస‌ముద్రం లాంటి పార్టీని చెబుతారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు, ఆస‌రా పెన్ష‌న్లు అమ‌లు చేస్తున్నారా? ఎందుకు తెలంగాణ మీద ప్రేమ పొంగిపొర్లుతోంది. 200 పెన్ష‌న్లు ఇచ్చినోడు.. ఇప్పుడు 4 వేలు ఇస్తామంటే న‌మ్ముదామా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.