*దామరచర్ల మండల కేంద్రం నందు 4 కోట్ల 20 లక్షల రూపాయలతో తెలంగాణ గిరిజన గురుకుల బాలుర పాఠశాల మంజూరు*
*90 లక్షల రూపాయలతో గాంధీనగర్ నుంచి కల్లేపల్లి వరకు బీ.టీ రోడ్లు మంజూరు*
*శంకుస్థాపన చేసిన గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్* …….,……………..
..దామరచర్ల ప్రజాలహరి…
దామరచర్ల మండల కేంద్రం నందు ST-SDF నిధులు 4 కోట్ల 20 లక్షల రూపాయలతో నూతన తెలంగాణ గిరిజన గురుకుల బాలుర పాఠశాలకు మరియు 90 లక్షల రూపాయలతో గాంధీనగర్ నుంచి కల్లేపల్లి వరకు నిర్మితమవుతున్నబీ.టీ రోడ్లు నిర్మాణ పనులకు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిధులుగా గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, తెలంగాణ రాష్ట్ర గిరిజన ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ ఇస్లావత్ రామచందర్ నాయక్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి గారు పాల్గొని స్థానిక శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారితో కలిసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు, అంతకు ముందు కల్లేపల్లి బంగారు మైసమ్మ దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు, ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఆలయ చైర్మన్ వారిని శాలువాలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు..అనంతరం దామరచర్ల మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు గురుకుల విద్యకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చారు.రాష్ట్రంలో వెయ్యికి పైగా గురుకులను ఏర్పాటు చేసుకున్నాం అని, గిరిజన సంక్షేమ శాఖ నుండి మిర్యాలగూడ నియోజకవర్గానికి 76 కోట్ల రోడ్లు మంజూరు ఇవ్వడం జరిగింది, సమైక్య పాలనలో గిరిజన గురుకులాలు 91 ఉంటే స్వరాష్ట్రంలో మరో 98 ఏర్పాటు చేసుకున్నాం. గురుకులాల్లో విద్యార్థులకు సీటు వచ్చిందంటే తమ పిల్లలు ప్రయోజకులై బయటకు వస్తారనే నమ్మకం తల్లిదండ్రులకు వచ్చింది. ఒక్కో విద్యార్థికి ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఇరవై వేలు ఖర్చు చేస్తోంది.విదేశీ వైద్యకు 9వేల కోట్లు అందించాము. అంబేద్కర్ ఓవర్సిస్ పేరుతో విదేశాలకు వెళ్లి చదువుకునే ఒక్క విద్యార్థికి 20 లక్షలు ఆర్దిక సహాయం అందజేస్తున్నాం.గురుకుల విద్యార్థులకు 20% డైట్ చార్జీలు పెంచాం. గత ప్రబుత్వం పట్టించుకుని ఉంటే రోడ్లకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. గురుకులకు ఎప్పుడో అభివృద్ధి చెందేవి. తెలంగాణ అభివృద్ధి గౌరవ కేసీఆర్ సాద్యం అయ్యింది అని మంత్రి తెలిపారు, ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి గురై అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన గిరిజన తండాలు స్వరాష్ట్రంలో సీఎం కే.సీ.ఆర్ గారి కృషితో ప్రగతి దిశగా అడుగులు వేస్తున్నాయి అని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి మిర్యాలగూడ నియోజకవర్గంలో గిరిజనుల సంక్షేమాభివృద్ధికి పెద్ద పీట వెయ్యడం జరిగింది అని నియోజకవర్గ వ్యాప్తంగా 38 తండాలను గుర్తించి గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేసి గిరిజనులకే స్వయం పాలన అందించిన ఘనత సీఎం కే.సీ.ఆర్, బి.ఆర్.ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు అదేవిధంగా దామరచర్ల మండలంలో 589 మందికి 963 ఏకరాల పోడుభూమి పట్టాలను అందజేయడం జరిగింది అని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు తెలిపారు, అనంతరం దామరచర్ల మండలంలో 20 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు అందజేసారు, ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా D.C.M.S వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, ZPTC అంగోతు లలిత హతిరాం, ఎం.పి.పి నందిని రవితేజ, మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ బైరం బుచ్చయ్య, వైస్ చైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ చైర్మన్ చిట్టిబాబు, లావురి మేఘ్య నాయక్, RDO చెన్నయ్య, వైస్ ఎం.పి.పి కటికం సైదులు రెడ్డి, బి,ఆర్,ఎస్ నాయకులు, మార్కెట్ కమిటి డైరెక్టర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎం.పి.టి.సి లు, గ్రామ శాఖ అద్యక్షులు, వార్డ్ మెంబర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు..