
*అక్టోబర్ 4న మిర్యాలగూడలో మెగా జాబ్ మేళా*
*పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు*
మిర్యాలగూడ ప్రజాలహరి
అక్టోబర్ 4న మిర్యాలగూడ పట్టణం నందిపహాడ్‌లోని టీ.ఎన్.ఆర్ గార్డెన్స్‌లో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో ఎన్.బీ.ఆర్ ఫౌండేషన్ ద్వారా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు, జాబ్ మేళాలో మొత్తం 21 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నారు అని ఎన్.బీ.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ తెలిపారు. జాబ్ మేళా పోస్టర్‌ను ఈరోజు స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులు ఇట్టి సదావకాశాన్ని వినియోగించి స్థిరమైన ఉద్యోగం పొందాలని ఆకాంక్షించారు..స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు….ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులుఅన్నభీమోజు నాగార్జున చారీ, ఖాజా మొహినుద్దీన్, జక్కా నాగేశ్వర్ రావు, సుద్దుల సైదులు, ఎం.డి షోయబ్, శిరసనగండ్ల శ్రీకాంత్ చారీ తదితరులు పాల్గొన్నారు…