ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి
* సమ్మెలో జూలకంటి రంగారెడ్డి
-మిర్యాలగూడ
ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. సమస్యల పరిష్కారం కోసం ఆశ వర్కర్లు చేపట్టిన సమ్మె మంగళవారం రెండో రోజు చేరుకుంది. ఏరియా ఆసుపత్రిలో సమ్మె చేస్తున్న ఆశ వర్కర్లకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. ఆశ వర్కర్లతో ప్రభుత్వం చాకిరీ చేయించుకుంటుందని ఆరోపించారు. ఆశ వర్ధలకు 18వేలు వేతన ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పెద్దకడూరు జారీ చేయాలన్నారు ప్రమాద బీమా ఐదు లక్షల ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించాలని కోరారు. ఏఎన్ఎం, జిఎన్ఎమ్, పోస్టులలో ఆశలకు ప్రమోషన్ ఇవ్వాలన్నారు. ఆశాలకు జాబ్ కార్డు విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్, సిఐటియు జిల్లా సహా కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి రవి నాయక్ ఆశా వర్కర్లు స్వర్ణ, తాహీరా, జ్యోతి, లోకేశ్వరి, మంగతాయి, రాజేశ్వరి, రమాదేవి, జ్యోతిక తదితరులు పాల్గొన్నారు.