సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
మిర్యాలగూడ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని నల్లగొండ జిల్లా రైతు బందు సమితి అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు మంగళవారం మిర్యాలగూడ మండలం బోట్య నాయక్ తండ (క్యాంపు తండ)లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎమ్మెల్యే భాస్కర రావు సహకారంతో మంజూరైన 2,00000 రెండు లక్షల రూపాయల చెక్కును రమావత్ నీలమ్మకు గ్రామంలో వారి ఇంటికి వెళ్లి అందజేస్తు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పట్ల ఒక వరం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోbrs సీనియర్ నాయకులు జొన్నలగడ్డ రంగారెడ్డి ,మండల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షులు సురేష్ నాయక్ ప్రధాన కార్యదర్శి మేకా రాంబాబు ఉమ్మడి గూడూరు గ్రామ మాజీ సర్పంచ్ డి సాగర్ నాయక్.తులసి రామ్ నాయక్. రామావత్ నాగు నాయక్. మున్ని నాయక్. నాగేష్ నాయక్.రామావత్ కౌసల్య. రాముడు నాయక్. తదితరులు పాల్గొన్నారు.