సాయుధ పోరాటానికి కమ్యూనిస్టులే వారసులు
* ఆనాడు బిజెపి బీఆర్ఎస్ లు లేవు
* కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేసింది
* ఓట్ల కోసమే సాయుధ పోరాటాన్ని వాడుకుంటున్నారు
* వాస్తవాలకు తెలిపేందుకే వారోత్సవాలు
* జాతీయ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి
-మిర్యాలగూడ, ప్రజాలహరి…
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టులే నిజమైన వారసులని అఖిల భారత కిసాన్ సంగ్ జాతీయ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ముగింపు సందర్భంగా ఆదివారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి రాజీవ్ చౌక్ మీదుగా ప్రదర్శన చేశారు అనంతరం అనుదితి ఫంక్షన్ హాల్ లో సభ నిర్వహించారు సభా సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారులు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి బుక్తి వెట్టిచాక్రీ విముక్తి కోసం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాయుధ పోరాటం సాగిందన్నారు నైజాం నవాబును తరిమికొట్టేందుకు ఎంతోమంది సామాన్యులు మట్టి మనుషులు సాయిదలుగా మారి వీరోచిత పోరాటాలు నిర్వహించారన్నారు. ఆనాడు బిజెపి బీఆర్ఎస్ పార్టీలు లేవని గుర్తు చేశారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏలుతున్న నైజాం నవాబులను ఎదుర్కోవడానికి సాహసం చేయలేదన్నారు. పైగా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారని గుర్తు చేశారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తెలంగాణకు స్వాతంత్రం రాలేదని నైజాం నవాబు పాలనలో తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురయ్యారని చెప్పారు. నైజాం కు వ్యతిరేకంగా మట్టి మనుషులు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో పోరాటం చేశారని నిజమైన హక్కు కమ్యూనిస్టులకే దక్కుతుందని చెప్పారు. ఆర్థిక రాజకీయ సామాజికపరంగా కుల మతాలకతీతంగా ఈ పోరాటం సాగిందన్నారు కానీ నేడు బిజెపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఓట్ల కోసం సాయుధ పోరాటాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు సాయుధ పోరాటానికి ప్రస్తుత ఆ పార్టీలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సభలు సమావేశాలు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ నైజం నవాబులు భూస్వాములు రజాకార్లు పెద్ద ఎత్తున భూములను తన ఆధీనంలో ఉంచుకోని ప్రజలపై పెత్తనం చేశారని అనేక అరాచకాలు సృష్టించారన్నారు నైజాం నవాబుల ఆగడాలని అరికట్టేందుకు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగిందన్నారు. రక్షణ కౌలు చట్టం అమలు చేసేందుకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశామన్నారు. నిస్వార్ధంగా సాగిన ఈ పోరాటంలో వేలాదిమంది అసువులు బాసారన్నారు. నాటి పోరాటం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం సాగిందని చెప్పారు. 12 మందికి ఉరిశిక్ష వేసిన సంఘటన ప్రపంచాన్ని కలిసి వేసిందని తెలంగాణ ప్రజల ఆకాంక్షను దృష్టిలో ఉంచుకొని ఆ 12 మందిపై ఉరిశిక్షను యావత్ జీవకారాగార శిక్షగా అప్పటి రాష్ట్రపతి మార్చారని గుర్తు చేశారు. సాయుధ పోరాటానికి నిజమైన వారసత్వం కమ్యూనిస్టులకే ఉంటుందని దాని స్ఫూర్తిగా తీసుకొని నేటి పాలకులపై పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. దేశానికి రాష్ట్రానికి కమ్యూనిస్టులు ఎంతో అవసరమని చెప్పారు. పేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే, అందరికీ సమాన న్యాయం కలగాలంటే కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని రాబోయే ఎన్నికల్లో వారిని ఓడించి బుద్ధి చెప్తారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు చైతన్యవంతులై ప్రజా సంక్షేమం కోరే కమ్యూనిస్టు పార్టీలను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తెలంగాణ సాయుధ పోరాట యోధులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ సిడి రవికుమార్ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు జిల్లా కమిటీ సభ్యులు మూడవత్ రవి నాయక్, డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, రేమిడాల పరుశురాములు, పోలే బోయిన వరలక్ష్మి, వినోద్ నాయక్, తిరుపతి రామ్మూర్తి శశిధర్ రెడ్డి, పాదూరి గోవర్ధన, రొండి శ్రీనివాస్, జటంగి సైదులు, ఊర్మిళ, చేనగాని యాదగిరి, పల్లా బిక్షం, పిల్లుట్ల సైదులు, వాడపల్లి రమేష్, మాధవ రెడ్డి, దేశిరం నాయక్,అరుణ, తదితరులు పాల్గొన్నారు