రేపు హైదరాబాదు లోని మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ గ్రామంలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ విజయభేరి బహిరంగ సభకు జన సమీకరణకు సంబంధించిన మిర్యాలగూడ నియోజకవర్గ సమీక్ష సమావేశం ను కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ లో నిర్వహించుకోవడం జరిగింది
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రేపు హైదరాబాదులో జరగబోయే విజయభేరి బహిరంగ సభకు భారీగా జన సందోహం తరలి రావాలని మన తెలంగాణ ప్రదాత తల్లి సోనియమ్మ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని రేపటి సోనియమ్మ సభకు మనమందరము భారీగా తరలి వెళ్ళు విజయభేరి సభను జయప్రదం చేసి రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ జెండాను ఎగరవేసి మన తెలంగాణ దమ్ము ధైర్యాన్ని చాటి చెప్పాలని అదేవిధంగా మిర్యాలగూడ నుండి దాదాపుగా 6000 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తరలి వెళ్తున్నారని వారన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు