కైరళి పాఠశాలలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్ : విద్యార్థులచే 60 స్టాల్స్ ఏర్పాటు :
* అలరించిన విద్యార్థుల రైతు వేషధారణలు..
* వెజ్ నాన్ వెజ్ వంటకాలతో గుమగుమలు.. వెయ్యి మంది సందర్శన :
మిర్యాలగూడ ప్రజలహరి…
మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డలో గల కైరళి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ కాలనీ వాసులను విద్యార్థుల తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకుంది. పాఠశాల చెందిన విద్యార్థినీ విద్యార్థులు 60 స్టాల్స్ ను ఏర్పాటు చేసి వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటు ఫ్రూట్ జ్యూస్ లను సైతం స్టాల్స్ లలో ప్రదర్శించారు. ఫుడ్ ఫెస్టివల్ లో భాగంగా విద్యార్థులు చేసిన వెజ్, నాన్ వెజ్ వంటకాల గుమగుమలతో నడుచుకుంటూ, ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారు సైతం కైరళి పాఠశాల ఫుడ్ ఫెస్టివల్ సందర్శనకు వచ్చే విధముగా చేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ అహ్మద్ మాట్లాడుతూ ముఖ్య అతిథులుగా విచ్చేసిన కౌన్సిలర్ ఫర్జానా మోహిజ్, డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, బిఆర్ఎస్ నాయకులు వజ్రం, జనయేత్రీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ లు హాజరై మాట్లాడుతూ ఫుడ్ ఫెస్టివల్ లో 60 స్టాల్స్ పెట్టి విద్యార్థులచే అన్ని రకాల వంటకాలు చేయటం మామూలు విషయం కాదన్నారు.టిఫిన్లు చికెన్, మటన్, నాన్ వెజ్ వంటకాలు ఫ్రూట్స్ చేసిన జ్యూస్లు మొత్తం కలిపి 60 రకాల వంటకాలు
సుమారు 1000 మంది పేరెంట్స్, ఆయా వార్డుల కాలనీ వాసులు తిలకించడం జరిగింది. ఇది ఇలా ఉండగా అన్ని వంటకాలు అద్భుతంగా ఉన్నాయని ఒక గంటలోనే అన్ని వంటకాలు అమ్ముడుపోవడం జరిగిందని, విద్యార్థులు చేసిన వంటకాలు 5 రూపాయల నుంచి 60 రూపాయలు దాకా అమ్మడం జరిగిందన్నారు. వచ్చిన నగదు ని విద్యార్థులకే అందజేయడం జరుగుతుందన్నారు. రైతుకు సంబంధించిన వేషధారణలతో విద్యార్థులు అలరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు వరలక్ష్మి, రాజేష్, రేష్మ, రేణుక విజయలక్ష్మి, స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్ మంజుల, రహీమున్నీసా, జాన్సీ సరిత నవీన, జకీయా, రమాదేవి, సల్మా, నసీమా, అంజుమ్, ఇష్రాత్ తదితరులు పాల్గొన్నారు.