Ultimate magazine theme for WordPress.

తొమ్మిది మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్

Post top
home side top

ప్రజాలహరి హైదరాబాద్… ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా పదివేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకుని భారతదేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాన్ని సృష్టిస్తున్నదనీ, దేశానికే ఆదర్శంగా రాష్ట్ర వైద్యరంగం పురోగమించడం తెలంగాణకు గర్వకారణమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తెలిపారు.

 

ఈరోజు సీఎం శ్రీ కేసీఆర్ చేతులమీదుగా 9 మెడికల్ కాలేజీలు ప్రగతి భవన్ నుండి వర్చువల్ పద్దతిలో ప్రారంభమయ్యాయి. తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి ప్రారంభ ప్రసంగంతో సమావేశం ప్రారంభమైంది. అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావు ప్రసంగించారు. అటు పిమ్మట సీఎం సందేశంతో సమావేశం ముగిసింది.

 

ఈ సందర్భంగా కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో నేటి నుండి నూతన మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి.

 

ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, సీఎం కార్యదర్శి శ్రీ రాజశేఖర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీ ఎస్ ఏ ఎం రిజ్వీ, వైద్య విద్య సంచాలకులు శ్రీ రమేశ్ రెడ్డి, వైద్యశాఖ సీఎం ఓఎస్డీ డా. గంగాధర్, కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వీ.సీ. శ్రీ కరుణాకర్ రెడ్డి, టిఎస్ఎంఐడీసీ ఎం.డీ. శ్రీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

post bottom

Leave A Reply

Your email address will not be published.