Ultimate magazine theme for WordPress.

చేనేత కళా వైభవం అద్భుతమైనది.. జగదీశ్ రెడ్డి

Post top
home side top

తెలంగాణ చేనేత కళావైభవం అద్భుతం

 

చేనేతరంగ అభివృద్ధి కోసం నిరంతరం తపిస్తున్న మహానుభావుడు సీఎం కేసీఆర్‌

 

పోచంపల్లి కళాకారుల ప్రతిభ అభినందనీయం

 

డబుల్ ఇక్కత్ వస్త్రాల డిజైన్లు అధ్బుతం

 

సంప్రదాయ చేనేత వస్త్రాల్లో ఇన్ని రంగులు వాడడం చాలా చాలా అరుదు

 

నూతన ఆవిష్కరణలకు జీవం పోస్తున్న చేనేత కార్మికులు అభినందనీయులు

 

బీఆర్ఎస్ హయాం లోనే చేనేత కార్మికుడి కి భరోసా

➖➖➖➖➖➖➖➖➖➖

ప్రతిభ కు ప్రోత్సహం అందించిన మంత్రి జగదీష్ రెడ్డి

 

అనుకోని అతిధిలా వెళ్ళి.. వరాలు ప్రసాదించిన మంత్రి

 

డిజైన్ డెవలప్ మెంట్ రీసెర్చ్ కోసం వర్క్ షేడ్ మంజూరు

 

గంట కు పైగా కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డ్ గ్రహీత బాలయ్య ఇంట్లో గడిపిన మంత్రి

 

బాలయ్య దంపతులు వేసిన డబుల్ ఇక్కత్ చీరల పరిశీలన, మగ్గం పై చీరల నేసే తీరును అడిగి తెలుసుకున్న మంత్రి

 

మంత్రి రాక తో ఆనందం లో బాలయ్య దంపతులు

➖➖➖➖➖➖➖➖➖➖

పోచంపల్లి చేనేత టైఅండ్‌డై ఇక్కత్‌ వస్త్రాల డిజైన్లు అద్భుతం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కితాబు ఇచ్చారు. ఇంటినే రీసెర్చ్ సెంటర్ గా మార్చుకుని తెలంగాణ చేనేత ప్రతిభ ను ప్రపంచ దేశాలకు చాటి చెబుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి కి చెందిన ఆచార్య లక్ష్మణ్ బాపూజీ అవార్డ్ గ్రహీత లు భోగబాలయ్య- సరస్వతి ల ఇంటికి కి అనుకోని అతిథిలా వెల్లిన మంత్రి ,బాలయ్య కుటుంబ సభ్యులను ఆశ్చర్య పరిచారు. భువనవగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తో కలిసి గంట కు పైగా చేనేత కళాకారుడు బాలయ్య ఇంట్లో గడిపిన మంత్రి 10 వేల రంగులు వచ్చేలా తయారు చేసిన చీరను పరిశీలించారు. బోగ బాలయ్య రూపొందించిన 10వేల రంగుల భారత దేశం పటంతో కూడిన డబుల్‌ ఇక్కత్‌ వస్త్రాన్ని డిజైన్లను చూసి ప్రశంసించారు. చేనేత రంగానికి ప్రపంచ నలువైపులా పేరు తేవడానికి ఇంటినే ప్రయోగశాల గా మార్చుకుని పోచంపల్లి టై అండ్ డై ఇక్కత్ హండ్లూమ్ డిజైన్, రీసెర్చ్ డెవలప్ మెంట్ అండ్ ప్రోడక్షన్ సెంటర్ నిర్వహిస్తున్న బాలయ్య- సరస్వతి దంపతులకు ప్రోత్సహం అందించేందుకు సత్వరమే వారికి అన్ని వసతులతో కూడిన షేడ్ ను మంజూరు చేశారు. దీంతో బాలయ్య దంపతుల ఆనందానికీ అవదులు లేకుండా పోయాయి. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇక్కత్‌ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా పోచంపల్లి కి పేరురావడం వెనుక చేనేత కార్మికుల కృషి ఎంతగానో ఉందని కొనియాడారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇక్కత్‌ వస్త్రాలకు మంచి డిమాండ్‌ ఉందన్నారు.ఆధునిక ఫ్యాషన్ రంగంలో చేనేత నిలబడాలంటే కొత్త డిజైన్లు వేస్తే కానీ అవకాశాలను అందిపుచ్చుకోలేమని, చేనేత అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఇక్కత్ అని పిలువబడే పోచంపల్లి చీరలకు ఉన్న డిమాండ్ మరే చీరలకు లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. తరతరాలుగా వస్తున్న చేనేత కళల సాంప్రదాయాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలన్న తపన ఇక్కడి నేతన్నల్లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. తెలంగాణ చేనేత ఉత్పత్తులకు అద్భుతమైన డిమాండ్‌ ఉందన్నారు. చేనేత కార్మికులకోసం ఇప్పటికే ఎన్నో పథకాలు తీసుకువచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మరింత అండగా ఉండేందుకు

కొత్తగా తెలంగాణ చేనేత మగ్గం పథకం తెచ్చిందన్నారు.ఉమ్మడి రాష్ట్రంలోదుర్భర పరిస్థితుల్లో ఉన్న నేతన్న కుటుంబాల్లో తెలంగాణ సర్కారు ఎన్నో పథకాలు అమలు చేస్తూ వెలుగులు నింపుతున్నది. నేత కార్మికుల సంక్షేమ కోసం నిరంతరం తపిస్తున్న మహానుభావుడు సీఎం కేసీఆర్‌ అన్నారు. నాడు ఎన్నో ఇబ్బందులతో నేత కార్మికులు వలసలు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటే,నేడు స్వరాష్టంలో నేతన్నల బతుకులు పూర్తిగా మారిపోయాయన్నారు. రైతుబీమా తరహాలో నేతన్న బీమాతోపాటు నూలు, మగ్గాలకు ఆనేక రాయితీలు ఇస్తుందన్నారు .ప్రత్యేక పొదుపు పథకంతో నేతన్నకు చేయూత, రూ.5 లక్షల చేనేత బీమాతోపాటు అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. చేనేత రుణమాఫీ, నేత కార్మికులకు పింఛన్‌, బ్లాక్‌ లెవల్‌ క్లస్టర్ల ఏర్పాటు తదితర కార్యక్రమాలు చేపట్టిందన్నారు. దాంతో రాష్ట్రంలో నేత కార్మికుల బతుకులు మారాయన్నారు. ఇతర రాష్ర్టాలకు వలసలు తగ్గడంతోపాటు ఆత్మహత్యలు అనే ప్రశ్నే ఉత్పన్నం కాని పరిస్థితి నెలకొంది అన్నారు.. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కెటిఆర్ లకు చేనేత కార్మికులపై ఉన్న ప్రేమ అభిమానాలకు నిదర్శనం అన్నారు.గంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్‌ మగ్గాలు,కార్మికులకు ప్రతినెలా బ్యాంకు ఖాతాల్లో రూ. 3వేల జమ

ఏటా రూ. 25వేల వరకు వైద్య సేవలు,హ్యాండ్లూమ్‌ పార్కుతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

*మంత్రి జగదీష్ రెడ్డి రావడం ఆశ్చర్యం కలిగించింది*

గత ఉమ్మడి ప్రభుత్వాలు చేనేత కార్మికులను పట్టించుకోలేదు. దీంతో మేము పనుల్లేక ఇత ర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చేది. కేసీఆర్‌ సీఎం అయిన తర్వాతే మాకు మంచి రోజులొచ్చాయి. మా ప్రతిభ ను చూడటానికి అనుకోని అతిధి లా మా ఇంటికి మంత్రి జగదీష్ రెడ్డి గారు రావడం సంతోషకరం. ఆయన కు చేనేత రంగం పై ఉన్న అవగాహన ఆశ్చర్యం కలిగించింది. మాకు షెడ్ ను మంజూరు చేసి మాకు ప్రోత్సహం ఇచ్చిన మంత్రి జగదీష్ రెడ్డి గారికి కృత్ఞతలు..

*భోగ బాలయ్య- సరస్వతి, కొండ లక్ష్మణ్ అవార్డ్ గ్రహీతలు,*

post bottom

Leave A Reply

Your email address will not be published.