యూరియా కొరత లేదు
ఏ డి ఏ నాగమణి
వేములపల్లి (ప్రజాలహరి) మండలంలోని అన్ని ప్రాథమిక సహకార కేంద్రాల్లో రైతులకు కావాల్సినంత యూరియా ఉన్నది దీనికోసం రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మిర్యాలగూడ ఏడి నాగమణి అన్నారు. మంగళవారం ఆమె వేములపల్లి మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని ఆగ్రో రైతు కేంద్రాలు, ఫర్టిలైజర్ షాపులలో యూరియా కావాల్సిన అంత ఉంది, దీనికోసం రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె రైతులకు సూచించారు, వెంటనే రైతులు తమకు కావలసినటువంటి ఏరియాను తెచ్చుకొని సద్వినియోగం చేసుకోవాలని ఆమె రైతులను కోరారు. మండలంలో ఉన్నటువంటి ఫర్టిలైజర్ షాపులు యజమానులు వీర్యను ఎమ్మార్పీ ధరలకు అమ్మాలని ఆమె షాపు యజమానులకు సూచించారు. ఎక్కడైనా షాప్ యజమానులు ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ అమ్మినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆమె హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె వెంట వేములపల్లి ఏవో హుసేంద్రమని, ఏ ఈ ఓ సంతోష్, నితిన్, మన్సూర్, వేములపల్లి పిఎసిఎస్ సీఈవో రవీందర్రావు, చైర్మన్ రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు