
ప్రజాలహరి…
మిర్యాలగూడ ఆర్డిఓ ఆఫీస్ ముందు అంగన్వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మెలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున సామాజికవేత్త మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి వారికి మద్దతు తెలియడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్నటువంటి న్యాయమైన కనీస వేతనం పర్మినెంట్ చేయడం వారికి ప్రమాద భీమ కల్పించడం వంటి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేనియెడల అంగన్వాడి ఉద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ మరియు బి ఎల్ అర్ బ్రదర్స్ వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తామన్నారు. అదేవిధంగా అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె ఎన్ని రోజులు చేస్తారో అన్ని రోజుల వరకు మధ్యాహ్నం ఉచిత భోజన సౌకర్యం బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో వారికి అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్జున్, డిసిసి ప్రధాన కార్యదర్శి నాగు నాయక్, మస్తాన్, శరత్ ,నాగరాజు , ఫయుం, కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు*