Ultimate magazine theme for WordPress.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు

Post top

ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రి గంటా అరెస్ట్, కుమారుడితో సహా – చంద్రబాబు తరలింపు..!!

 

ఏపీలో అరెస్ట్ ల కలకలం కొనసాగుతోంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబును నంద్యాలలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసారు. నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. ఇదే సమయంలో అనూహ్యంగా మాజీ మంత్రి గంటాతో సహా ఆయన కుమారుడిని కూడా అరెస్ట్ చేసారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా గంటా స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రం నిర్వహణలో గంటా ప్రమేయంపై ఆరోపణలు ఉన్నాయి.

 

 

 

ఏపీలో వరుస అరెస్ట్ లు జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబును ఈ తెల్లవారు జామున నంద్యాలలో పోలీసులు నోటీసు ఇచ్చారు. చంద్రబాబు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తనకు ఎటువంటి ప్రమేయం లేని కేసులో తన ప్రమేయం ఉందని చెప్పటం పైన చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఎఫ్ఐఆర్ లో తన పేరు లేకపోయినా అరెస్ట్ చేయటం ఏంటని ప్రశ్నించారు. దీని పైన పోలీసు అధికారులు అన్ని వివరాలు కోర్టుకు నివేదించామని..రిమాండ్ రిపోర్టులో అన్ని వివరిస్తామని అధికారులు వెల్లడించారు. అరెస్ట్ చేసిన చంద్రబాబును వైద్య పరీక్షల తరువాత నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తున్నారు.

 

ఇదే సమయంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు, ఆయన కుమారుడు రవిచంద్రను పోలీసులు అరెస్ట్ చేసారు. చంద్రబాబు హయాంలో గంటా విద్యాశాఖ మంత్రిగా పని చేసారు. స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రం ఏర్పాటులో గంటా పైన అభియోగాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ వ్యవహారంలో షెల్ కంపెనీల ఏర్పాటు ద్వారా భారీ స్థాయిలో అవినీతి జరిగిందని సీఐడీ, ఈడీ అభియోగాలు నమోదు చేసింద. అందులో భాగంగానే చంద్రబాబు, గంటాను అరెస్ట్ చేసారు. ఇప్పుడు వీరిద్దరి అరెస్ట్ కు సంబంధించి సీఐడీ అధికారులు కాసేపట్లో మీడియా సమావేశం ద్వారా పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. గంటా కుమారుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది.

 

 

స్కిల్ డెవలప్ మెంట్ కసులో ఏ1గా చంద్రబాబు ను పేర్కొన్నారు. చంద్రబాబును విజయవాడకు తరలిస్తున్న సీఐడీ, గంటాను కూడా సీఐడీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్దంగా స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రం ఏర్పాటు చేసారనేది గంటా పైన అభియోగం. తమ పైన ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతోందని చంద్రబాబు, గంటా ఆరోపించారు. ఎటువంటి ప్రమేయం లేకపోయినా తమ పైన ఉద్దేశ పూర్వకంగా వేధింపులకు గురి చేస్తున్నారని గంటా ఆరోపించారు. తాము వీటిని ఎదుర్కొంటామని.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు చంద్రబాబు, గంటా అరెస్ట్ తరువాత ఏ2గా ఉన్న అచ్చెన్నాయుడు వ్యవహారంలో ఏం జరుగుతుందేని ఇప్పుడు చర్చగా మారుతోంది.

 

చంద్రబాబు అరెస్ట్ పై పురందేశ్వరి స్పందన – నిలదీస్తున్న నెటిజెన్లు..!!

 

అలా చేయాలంటే, అరెస్ట్ కు ఇది సమయం కాదు – సజ్జల కీలక వ్యాఖ్యలు..!!

 

లోకేశ్ బైఠాయింపు, తండ్రిని చూడనీయరా – ముందస్తు అరెస్ట్ లు, అలర్ట్..!!

 

విజయవాడకు చంద్రబాబు తరలింపు – తప్పు చేస్తే ఉరేయండి..!

post bottom

Leave A Reply

Your email address will not be published.