లీగల్ ఎయిడ్ కౌన్సిల్ న్యాయవాదిగా సైదులు నియామకం…. మిర్యాలగూడ ప్రజాలహరి.. మిర్యాలగూడ
రెండవ అదనపు మెజిస్ట్రేట్& ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పరిధిలో ఆర్థిక స్తోమత లేని కక్షిదారుల కోసం వారి తరఫున కోర్టులలో వాదనలు వినిపించడానికి గాను లీగల్ ఎయిడ్ కౌన్సిల్ న్యాయవాదిగా రెడ్డిపల్లి సైదులును నియమిస్తూ జిల్లా ప్రిన్సిపల్, జిల్లా సెషన్ జడ్జి నాగరాజు ఉత్తర్వులు జారీ చేశారు. పదవీకాలం మూడేళ్ల పాటు కొనసాగుతుంది. కౌన్సిల్ న్యాయవాదిగా నియామకమైన సైదులు కోర్టు కేసులలో వకీళ్లు పెట్టుకోలేని వారికి న్యాయ సలహాలు ఇస్తూ వారి తరఫున కోర్టులో వాదనలు వినిపించాల్సిన ఉంటుంది.