Ultimate magazine theme for WordPress.

శ్రీ దండు మైసమ్మ అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి

Post top
home side top

వైభవంగా శ్రీశ్రీశ్రీ దండు మైసమ్మ అమ్మవారి విగ్రహ పున: ప్రతిష్టాపన మహోత్సవం

 

సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

 

ఆలయాల పరిసరాల్లో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ

 

జై మైసమ్మ..జై మాత నినాదాలతో పులకించిన నెమ్మికల్ గ్రామం

 

క్రేన్ మోరాయించడం తో కర్ర ల సహాయం తో సాహోసోపేతంగా ఆలయ శిఖర భాగానికి చేరుకున్న మంత్రి దంపతులు

 

శిఖరానికి కుంభాభిషేకం

 

మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక చొరవ తో కోటి రూపాయల వ్యయం తో నిర్మితమైన అమ్మవారి నూతన ఆలయం

 

*సూర్యాపేట*

శతాబ్ది కాలంనుండి భక్తుల కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చుతున్న అమ్మలగన్న అమ్మ , ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ మహాలక్ష్మి, మహాకాళీ మహా సరస్వతి మహా స్వరూపిణి అయినటువంటి శ్రీశ్రీశ్రీ దండుమైసమ్మ అమ్మవారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. మృగశిర నక్షత్రయుక్త తులా లగ్న పుష్కారాంశ ముహూర్తన ఉదయం 10:32 ని” లకు యంత్ర ప్రతిష్ఠ, దేవి విగ్రహ, శిఖర , బలిపీఠ, పోతు రాజు మూర్తుల ప్రతిష్ఠా మహోత్సవం సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా వేదపండితులు, ఆర్చక బృందం మంత్రోచ్చరణ ల మధ్య కన్నుల పండువగా సాగింది. తరలి వచ్చిన వేలాది మంది అమ్మవారి భక్తుల తో నెమ్మీకల్ పరిసరాలు ఆధ్యాత్మిక శోభ ను సంతరించుకున్నాయి.జై మైసమ్మ జై జగదాంబమాత నినాదాలతో ఆలయ పరిసరాలు భక్తి పారవశ్యంతో పులకరించి పోయాయి. క్రేన్ మెరాయించడం తో సెంట్రింగ్ కర్ర ల సహాయం తో సాహోసపేతంగా ఆలయ శిఖర భాగానికి చేరుకున్న మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు, కుమారుడు వేమన్ కుంభాబిషేకం నిర్వహించారు.. అనంతరం భక్తుల తో కలిసి అమ్మవారి జపాన్ని జపిస్తూ భక్తి పారవశ్యం లో పరవశించిపోయారు. ఐదు గంటల పాటు ఆలయ విగ్రహ ప్రతిష్ఠా వేడుకల్లో పాల్గొన్న అనంతరం అమ్మవారికి తొలి పూజలు చేసిన మంత్రి దంపతులు అమ్మవారి హరతి తీసుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రహదారి వెంట వెళ్లే వాహనదారులను అనునిత్యం ప్రమాదాల బారిన పడకుండా తన చల్లని చూపులతో కాపాడుకుంటున్న దండు మైసమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రతీ ఒక్కరికీ కలగాలని ఆకాంక్షించారు. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని విజయవంతం గా పూర్తి చేసుకున్నమన్నారు. వేడుకలలో పాలు పంచుకున్న ప్రతీ ఒక్కరికీ కృత్ఞతలు, దన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమం లో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ దంపతులు, జెడ్పి వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పెరుమాల అన్నపూర్ణ, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఎంపిపి మర్ల స్వర్ణ లత చంద్రా రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు తూడి నర్సింహ రావ్, బత్తుల ప్రసాద్, మారి పెద్ది శ్రీనివాస్ గౌడ్,కోతి ప్రదీప్ రెడ్డి,సర్పంచ్ సతీష్ , ఉప సర్పంచ్ ఉపెందర్, గ్రామ శాఖ అధ్యక్షుడు సైదులు, మాజీ మార్కెట్ వైస్ ఛైర్మెన్ కృష్ణారెడ్డి, ఎంపిటిసి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.