మిర్యాలగూడ ప్రజాలహరి…
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ సందర్భంగా శుక్రవారం మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2023 మార్చిలో జరిగిన SSC మరియు ఇంటర్మీడియట్ పరీక్షలలో అత్యున్నత మార్కుల సాధించిన విద్యార్థులకు 10 మందికి మన లయన్ సభ్యులు లయన్ కె చెన్నకేశవులు వెండి పతకాలను అందించారు.
ఈ కార్యక్రమం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ప్రోగ్రాం చైర్ పర్సన్ లయన్ కె చెన్నకేశవులు మాట్లాడుతూ పేద మధ్యతర మధ్యతరగతి విద్యార్థులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు ప్రస్తుతం విద్య చాలా ఎత్తులో ఉన్నదని సామాన్య విద్యార్థులకు అందుబాటులోకి రావాలని కోరారు.లయన్ కర్నాటి రమేష్ మాట్లాడుతూ పట్టుదల ,క్రమశిక్షణ కలిగి చదువుల్లో మేటిగా నిలుస్తున్న విద్యార్థులకు తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు ., లయన్ అధ్యక్షులు యనగండ్ల లింగయ్య ,కార్యదర్శి మరియు లయన్ ముత్యాల రామకృష్ణారావు కోశాధికారి పాల్గొన్నారు