సమస్యలు పట్టించుకోని… ప్రభుత్వాలకు ఓడించి బుద్ధి చెప్పాలి
* పెరిగిన నిత్యవసర వస్తువుల ధరను అదుపులోకి తేవాలి
* సిపిఎం నిరసనలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి
-ప్రజాలహరి-మిర్యాలగూడ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాజకీయాల తప్ప ప్రజా సమస్యలు పట్టింపు లేవని, అలాంటి ప్రభుత్వాలను ఓడించి బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర కమిటీ పిలుపుమేరకు శుక్రవారం స్థానిక సీపీఎం ఆఫీస్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పెరిగిన ధరలతో అల్లాడుతుంటే ధరలను తగ్గించకుండ ప్రజల దిష్టి మళ్లించేందుకు దేశం పేరు మార్పు తీసుకొచ్చారని ఆరోపించారు. ప్రజలు దేశం పేరు మార్చాలని ఎక్కడైనా అడిగారా అని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించాలని ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న వాటిని పట్టించుకోకుండా ఏదో మార్పు చేసినట్లు రాజకీయంగా లబ్ధి పొందాలని మోడీ కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. ప్రజల మధ్య విద్వేషాలు సూచించి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని మోడీ ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజలు అన్ని విషయాలను గమనంలోకించుకొని ఎన్నికల్లో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని ఆ పథకాలన్నీ సొంత పార్టీ కార్యకర్తలు అందజేస్తున్నారని ఆరోపించారు. పేదల కోసం పథకాలు తెస్తున్నామని చెబుతున్న కేసీఆర్ సొంత పార్టీ కార్యకర్తలకు కొందరికే ఇచ్చి నిజమైన పేదలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. పథకాలు అందే తీరుపై ప్రజలకు వివరించి చైతన్య పరచాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కార్యకర్తలు ఎప్పటికప్పుడు అండగట్టాలని సూచించారు. ఇలాంటి ప్రభుత్వాలను ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మూడవత్ రవి నాయక్, రాగిరెడ్డి మంగారెడ్డి, పోలేబోయిన వరలక్ష్మి, రెవిడాల పరశురాములు, తిరుపతి రామ్మూర్తి, శశిదర్ రెడ్డి, ఎండి అంజాద్, వేములపల్లి వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధన, రొండి శ్రీనివాస్, పిల్లుట్ల సైదులు, పతని శ్రీనివాస్, సైదమ్మ, కందుకూరి రమేష్, దేశిరం నాయక్, రామారావు, వెంకట్ రెడ్డి, పాల్వాయి రాం రెడ్డి, చౌగాని వెంకన్న, ఉన్న వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.