సవాళ్లకు పరిష్కారం చూపుతున్న భారత్ G-20 ప్రెసిడెన్సీ!
ప్రజాలహరి జనరల్ డెస్క్…
కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచం మొత్తాన్ని అనేక నూతన సమస్యలు చుట్టి ముట్టగా భారతదేశం వాటి పరిష్కారం కోసం అనేక చర్యలను చేపట్టింది. సంక్షేమం నుండి అభివృద్ధి వరకు సరైన కొలమానంలో తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. దేశంలో నిరుపేదలకు ఊతమిచ్చినట్లుగానే ప్రపంచవ్యాప్తంగా వెనుక పడ్డ దేశాల ఆకాంక్షలను భారతదేశం G-20 అధ్యక్షతన ముందు వరుసలో నిలబెట్టింది.