రాహుల్ జూడో యాత్ర చేసి సంవత్సరకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏఐసిసి పిలుపుమేరకు ఈరోజు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి ఈదులగూడెం చౌరస్తా వరకు వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానుల తో పాదయాత్ర నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బిఎల్ఆర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారి జుడోయాత్ర సెప్టెంబర్ 7 2022 న మొదలై కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 146 రోజులు 5000 కిలోమీటర్లు నడిచి ప్రజల కష్టాలు బాధలు తెలుసుకుని ప్రపంచ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించిన అగ్ర నాయకులు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు అహర్నిశలు ఆలోచించే అభ్యున్నతవాది రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజల తరఫున తెలియజేస్తున్నామని ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈరోజు హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నామని వారన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్లు వార్డ్ ఇన్చార్జిలు ఎంపీటీసీలు సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు కార్యకర్తలు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు