మిర్యాలగూడ పట్టణము రెడ్డికాలని మిర్యాలగూడ నియోజక వర్గ యాదవ సంఘ భవనం నందు నిర్వహించిన శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు , తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ‘‘పావనమూ, పవిత్రమూ అయినటువంటి జన్మాష్టమి సందర్భం లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరి కి శుభాకాంక్షలు తెలుపుతూ, భక్తిమయమైన మరియు ఉల్లాసభరితమైన ఈ ఉత్సవం సంతోషాన్ని,ఆనందాన్ని, సమృద్ధి ని మరియు సౌభాగ్యాన్ని ప్రతి ఒక్కరి జీవనం లోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ప్రపంచానికి గీతను బోధించి, ప్రేమ తత్వాన్ని పంచిన శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు తెలంగాణా రాష్ట్ర ప్రజలపైన సదా ఉండాలని కోరుకుంటున్నమని తెలిపారు. కార్యక్రమములో BRS మండల అధ్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, మిర్యాలగూడ నియోజక వర్గ యాదవ సంఘ నాయకులూ కట్టేబోయిన శ్రీనివాస యాదవ్, పగిడి రామలింగయ్య యాదవ్, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, జంగా లక్ష్మణ్ యాదవ్, రాజ్ కుమార్, యర్రయ్య, పసుల కాశయ్య, సంకబుడ్డి సత్యం, యాదవ సంఘం పెద్దలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.