Ultimate magazine theme for WordPress.

కల్లేపల్లి బంగారమైసమ్మ దేవాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కరరావు

Post top

ప్రజాలహరి దామరచర్ల…. ప్రజల హరిఆధ్యాత్మికత, మత సంప్రదాయల ప్రకారం శ్రీ శ్రీ శ్రీ కల్లేపల్లి బంగారు మైసమ్మ తల్లి దేవాలయ పున:ప్రతిష్ట నిర్మాణానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు , తెలంగాణ రాష్ట్ర ట్రైకార్ మరియు అగ్రోస్ చైర్మన్ లు ఇస్లావత్ రామచందర్ నాయక్, తిప్పన విజయసింహ రెడ్డి గార్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్య దైవం కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం అమ్మ వారని, అని ప్రస్తుతం గిరిజనులతో పాటు అన్ని వర్గాల ప్రజలు దర్శనం చేసుకుంటారని అలాగే మన రాష్ట్రం తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కుడా భక్తులు అమ్మవారి రోజైన ఆదివారం రోజు పెద్ద ఎత్తున పూజలు చేసుకుంటారని తెలిపారు. భక్తుల మనోభావాలను గుర్తించి, ఇక్కడ సకల సౌకర్యాల కోసం ప్రభుత్వం దేవాదాయ శాఖ ద్వారా 55 లక్షల రూపాయల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టడం నిమిత్తం ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. అమ్మ వారి దయ ప్రజలందరిపై ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఇలాగే సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఇందుకోసం మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారని ఇందులో భాగంగానే అర్చకులకు నెలకు 6 వేల గౌరవ భ్రుతి నుంచి నేడు 10 వేల కు పెంచుకున్నామని తెలిపారు. మున్ముందు కూడా ఇలాగె మనందరి మద్దతుతో కెసిఆర్ గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే మరీన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమములో రాష్ట్ర BRS నాయకులు ధీరావత్ స్కైలాబ్ నాయక్, DCMS వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ బైరం సంపత్, MPP ధీరావత్ నందిని రవితేజ, ZPTC అంగోతు లలిత హతిరాం నాయక్, మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి, మాజీ AMC చైర్మన్ చిట్టిబాబు నాయక్, యూసఫ్, పెద్ద కోటి రెడ్డి, దారాగాని వెంకటేశ్వర్లు, వైస్ MPP కటికం సైదులు రెడ్డి, సోము సైది రెడ్డి, స్థానిక MPTC ధీరావత్ శారద పాచు నాయక్, బాల లక్ష్మి సత్యనారాయణ, ధీరావత్ వెంకటేశ్వర్లు, తోల్చ నాయక్, హనిమి రెడ్డి, పరంగి సురేష్, చంద్ర శేఖర్,తులసిదాస్ నాయక్,మానా నాయక్, ఎర్ర నాయక్, పోకల రాజు, చొక్కా రావు అన్ని గ్రామా సర్పంచ్ లు, MPTC లు, ఆలయ చైర్మన్ ధీరావత్ భాష్య నాయక్, BRS గ్రామ శాఖ అధ్యక్షులు సేవా నాయక్, బాలశంకర్, కందుల నాగి రెడ్డి, కో ఆప్షన్ నాగుల్ మీరా, జనార్ధన్ నాయక్, ఆలయ కార్య నిర్వహణ అధికారి గుజ్జుల కొండా రెడ్డి, మెగా నాయక్, ప్రసాద్ నాయక్, గణపతి, తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.