మాజీ రాష్ట్రపతితో అమిత్ షా భేటీ.
ప్రజాలహరి,న్యూఢిల్లీ
తొలి భేటీకి సన్నాహకాలు చేస్తోంది. ఇందులో భాగంగా ‘జమిలి ఎన్నికల కమిటీ’ ఛైర్మన్‌గా ఉన్న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah), న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్‌మేఘ్వాల్ భేటీ అయ్యారు. రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) నివాసంలో సుమారు గంటపాటు ఈ సమావేశం కొనసాగింది. ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని.. కమిటీ ‘తొలి సమావేశం’, వేదికకు సంబంధించిన ఏర్పాట్లకు కృషి జరుగుతోందని కేంద్ర మంత్రులు వెల్లడించారు. భవిష్యత్తులో జరిగే ఈ సమావేశాలు హైబ్రిడ్ విధానంలోనూ ఉండవచ్చన్నారు.
‘జమిలి’ కమిటీలో 8 మంది..ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
జమిలి ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న రామ్‌నాథ్ కోవింద్ న్యాయశాఖ మంత్రిత్వ ఉన్నతాధికారులు ఇటీవలే భేటీ అయ్యారు. ఎనిమిది మందితో కమిటీని కేంద్రం ఏర్పాటుచేయగా.. ఏ ఎజెండాతో ముందుకెళ్లాలనే దానిపై న్యాయశాఖ కార్యదర్శి నితిన్‌చంద్ర, శాసన వ్యవహారాల కార్యదర్శి రీటా వశిష్ఠ తదితరులు చర్చించారు. కమిటీలో ఉన్న సభ్యులుగా ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్‌మేఘ్వాల్‌లు మాజీ రాష్ట్రపతితో గంటకు పైగా చర్చలు జరిపారు. కమిటీకి సహాయకులుగా ఉండే అధికారులను ఎంపిక చేసే పనిలో న్యాయశాఖ నిమగ్నమైనట్లు సమాచారం.
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీలో ఎనిమిది మంది సభ్యులు ఉండగా.. అందులో ఉండటానికి లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత అధీర్‌రంజన్ చౌధరి నిరాకరించారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు.