Ultimate magazine theme for WordPress.

దిమ్మరి పుస్తకావిష్కరణ

Post top
home side top

దిమ్మరి పుస్తకావిష్కరణ…

 

మూడు వారాల క్రితం కవయిత్రి ఆర్.రమాదేవి గారు నేను జయతి లోహితాక్ష‌‌‌న్ గార్లను కలిసివచ్చానండీ అనీ మాటల సందర్భంలో అన్నారు.వాళ్ళ గురించి

అప్పటి దాకా నాకు తెలియదు.రమాదేవి గారు విషయమంతా చెప్పాక వాళ్ళను కలవాలనిపించింది

నాగార్జునసాగర్ కు పది కిలోమీటర్ల ముందు మేయిన్

రోడ్డు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో గుట్టల ప్రాంతంలో ఉంటున్నారు,అని చెప్పారు ‌కానీ వాళ్ళ

గురించి పూర్తిగా వివరించలేదు.ఆరోజే నిర్ణయించుకున్నాను, ఎలాగైనా ఒక ఆదివారం వెళ్లి వాళ్ళని కలవాలని.జయతి గారు ఫేస్బుక్ లో ఆక్టివ్ గా ఉన్నారని తెలిసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాను.ఆమె వెంటనే స్పందించారు,ఆమోదించారు.

ఒక రోజు ఆమె వాల్ మీద దిమ్మరి పుస్తకావిష్కరణ

గురించి ఒక పోస్ట్ చూసాను.సెప్టెంబర్ 3 వ తేదీ ఆదివారం, నాగార్జున సాగర్ రోడ్డులో ఒక పది కిలోమీటర్ల దూరంలోని ఒక కొండ ప్రాంతంలో ఉన్న

మట్టి మనుషుల మ్యూజియంలో జరుగుతుందని.

అడ్రస్ క్లియర్ గా లేదు.ఎలా మరి అనుకుంటుండగా

మట్టి మనిషి పాండురంగారావు గారు జ్ఞాపకం వచ్చారు.వెంటనే ఆయనకు ఫోన్ చేసి అడ్రస్ అడిగాను

అంతకు ముందు అడవి దేవుల పల్లికి చెందిన రవీందర్ గారిని కూడా అడిగాను.వారిరువురూ దారిని సుగమం చేసారు.మరో పది నిమిషాల్లో మట్టి మనిషి గారి ఫోన్, మీరు వచ్చేటప్పుడు కవి చినవీరభద్రుడు

గారిని మీ కార్లో తీసుకొని రండంటూ ఆయన ఫోన్ నెంబర్ వాట్సాప్ మెసేజ్ చేసారు….

మట్టి మనిషి పాండురంగారావు

ఈయన నల్గొండ జిల్లా మిర్యాలగూడ దగ్గరలోని ఆల్లగడప గ్రామ వాస్తవ్యులు.ఈయన గురించి

మొదటి సారి విన్నది ఇరవై ఏళ్ళ క్రితం.

నా మిర్యాలగూడ స్నేహితుడు చిన్న ద్వారా ఆయన గురించి తెలుసుకున్నాను.ఆయన మనుషులతో మమేకం అవుతూ, అందరితో స్నేహంగా

ఉంటూ అజాత శత్రువు గా ఇటు సాహిత్యంలోనూ,

అటు ప్రజల్లోనూ కలిసిపోయే వ్యక్తి.

ఇరవై ఏళ్ల క్రితం ఆల్లగడపలోనీ ఆయన ఇంటికి నేను

చిన్న ఇద్దరం కలిసి వెళ్ళాం.ఆ ఇంటిని చూస్తే పాత వంశీ సినిమాల్లో లాగా గోడకు వేళ్ళాడే కందీలు ( లాంతరు), గోడలపై వివిధ రకాల సంగీత వాయిద్యాల పెయింటింగ్స్,ఇంటి నిండా ప్రముఖ రచయితల పుస్తకాలు…అలా ఆ ఇల్లు చాలా వెరైటీగా

ఉండేది.ఆ ఇంట్లో ప్రముఖ కవులు రచయితల కవి సమ్మేళనాలు,చర్చాగోష్టి కార్యక్రమాలు అనేకం జరిగేవి.

మట్టి మనిషి పాండురంగారావు గారు పుస్తకాలు బాగా

చదువుతారు, చర్చిస్తారు, సమీక్షిస్తారు, బాగా లేకుంటే

ముఖం మీద కుండ బద్దలు కొట్టినట్టు ఫలానా చోట నాకెందుకో నచ్చలేదని చెపుతారు, అది ఆయన పద్దతి.ఆయన మట్టి మనుషులు పేరుతో ఒక పబ్లిషింగ్ హౌస్ ని కూడా ప్రారంభించారు.ఎలాంటి లాభాపేక్ష లేకుండా అనేక మంది రచయిత్రుల, రచయితల పుస్తకాలు అచ్చు వేసారు.జయతి నాలుగు

పుస్తకాలను ఆయనే ప్రచురించారు.పేపర్ క్వాలిటీలో

ప్రింటింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాడు. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరినీ ప్రేమతో అన్నా అని పలకరిస్తాడు.ఆ పిలుపులో ఆప్యాయత ప్రస్పుటంగా కనిపిస్తుంది.ఆ గుండె అందరినీ దగ్గరకు తీసుకుంటుంది.సాటివాళ్ళు కష్టాల్లో ఉన్నారంటే తట్టుకోలేడు.తను సహాయం చేయలేకపోయినా ఇతరుల ద్వారా అయినా అయ్యేల చేస్తాడు.ఎప్పుడూ

సాటి మనుషుల కోసం ఏదో చేయాలని తపన పడే మనస్తత్వం.తనకు స్వార్థం లేదు, రాజకీయం తెలువదు, సగటు మనిషికి ఉండే కుళ్ళు, కుతంత్రాలు

స్వార్థాలు లేవు, ఉన్నదాంట్లో ఊడ్చిపెట్టి ఇచ్చే గుణం.అందుకే ఆయనంటే అందరికీ గౌరవం, ప్రేమ

అభిమానం.పురాతన వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేయాలన్నది,ఆయన కల.ఆ కలను సాకారం చేసుకోవడానికి ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆయన ఆశయం నెరవేరాలనీ అందరం మనసారా కోరుకుందాం…..కట్ చేస్తే…

ఆదివారం ఉదయం ఎనిమిది గంటలు.

అహ్లాదకరమైన వాతావరణం.సన్నగా చినుకులు పడుతున్నాయి,ఆనందంగా ఉంది.నా ఫోన్ రింగ్ అయ్యింది,అది వాడ్రేవు చిన వీరభద్రుడు గారిది.. మీరు ప్రోగ్రాం కి వస్తున్నారు కదా అని…చాలా సంతోషం అయ్యింది,అంత పెద్ద కవి రచయితతో నా కారులో

ప్రయాణం చాలా గొప్ప అనుభూతి.ఆ .. వస్తున్నాను సార్ మీరు పదింటి వరకు ఎల్బీనగర్ కు వచ్చేయండి

అక్కడి నుంచి ఇద్దరం నాగార్జున సాగర్ కి వెళదాం అని

చెప్పి ఫోన్ పెట్టేసాను.సరిగ్గా పది గంటలకు ఎల్బీనగర్

నా కారు ఎక్కారు వాడ్రేవు చిన వీరభద్రుడు గారు….

ఆయన విశ్రాంత గ్రూప్ వన్ ఆఫీసర్.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో

ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా,ఆ తరువాత స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా ముప్పై అయిదు సంవత్సరాలు

పని చేసి రిటైర్ అయ్యారు.పందొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం నుంచి ఆయన కవితలు, కథలు, వ్యాసాలు, రాస్తున్నారు.అప్పట్లో ఆయన ఇండియా టుడే తెలుగు పత్రికలో ఒక కాలమ్ రాసేవారు.మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి అనేక రచనలను ఆయన

తెలుగులోనికి అనువదించారు.రెండు వేల ఎనమిదవ సంవత్సరంలో కలాం గారి ఒక రచనను తెలుగులోనికి

అనువదించినందుకు గాను చిన వీరభద్రుడు గారికి

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.ఏడు

కవితా సంకలనాలు,ఒక నవల, అయిదు కథా సంకలనాలు, ఇండియా టుడే వ్యాసాల సంకలనం, అబ్దుల్ కలాం రచనల తెలుగు అనువాదాలతో మొత్తం

నలభై పుస్తకాలు రచించారు.ఎంత గొప్ప విషయం.

జయతి లోహితాక్షన్ ల పరిచయం, వారితో సాహితీ

ప్రయాణం,ఆయన రాసిన పుస్తకాల గురించి, దారి పొడవునా చెప్పుకుంటూ వచ్చారు.టైం తెలియలేదు.

సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటకు నాగార్జున సాగర్ నుంచి హాలియా( అహల్య) రోడ్డులో ఉన్న చిన్న సమ్మక్క గుడి కుడివైపున రెండు కిలోమీటర్ల దూరంలో

నిర్మాణంలో ఉన్న మట్టి మనుషుల మ్యూజియంకు

చేరుకున్నాం.

గేట్ దగ్గరకి వచ్చి జయతి లోహితాక్షన్ లు

చిన వీరభద్రుడు గారికి స్వాగతం పలికారు.అప్పటికే

అక్కడ మట్టి మనిషి పాండురంగారావు, బంగారు రామాచారి..ఈయన రిటైర్ ప్రభుత్వ ఉద్యోగి.కోదాడలో

నివాసం.విశేషమేమిటంటే ఆయన పది వేల పుస్తకాలు

సేకరించి,ఆయన ఇంట్లోనే ఒక లైబ్రరీనీ ఏర్పాటు చేశారు. హిస్టారికల్ మ్యానుస్క్రిప్ట్ లను డిజిటలైజ్ చేసి

చరిత్ర గురించి రాసే రచయితలకు తగిన సమాచారాన్ని అందిస్తూ సహాయ పడుతున్నారు.

ఆయనతో పాటు విజయవాడ నుంచి విద్యుత్ శాఖలో

పనిచేసే సోమశేఖర్, నల్గొండకు చెందిన జర్నలిస్టు,

యూట్యూబర్ క్రాంతి కుమార్ దంపతులు

హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో స్కూల్స్ నడుపుతున్న చంద్రశేఖర్,అనితా దంపతులు

కవయిత్రులు రమాదేవి,గీతావెల్లంకిలు,

హైదరాబాద్ లో గ్రాఫిక్స్ డిజైనర్ బంగారు బ్రహ్మం,కవి

నందకిషోర్,రమేష్, డిగ్రీ కళాశాల లెక్చరర్ సంధ్య….

ఇలా దాదాపు ఇరవై అయిదు మంది ప్రముఖులు మధ్యాహ్నం మూడింటికల్లా ఇందిరా- శ్రీ కిషన్ ల

స్మారక మట్టి మనుషుల మ్యూజియానికి చేరుకున్నారు

అక్కడ ఏర్పాటు చేసిన రుచికరమైన భోజనం తిన్నాక నాలుగు గంటలకు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మొదలైంది.మొదట యువ కవి నంద కిషోర్ ఇంకా ట్యూన్ కట్టని ఒక గీతాన్ని ఆలపించాడు.కవి చిన

వీరభద్రుడు గారి పరిచయ వాక్యాలు..కాగానే

ఒక్కొక్కరూ తమను తాము సభకు పరిచయం చేసుకున్నారు.అటు పిమ్మట అనితా చంద్రశేఖర్ గారు

దిమ్మరి పుస్తకాన్ని ఆవిష్కరించారు.వచ్చిన వాళ్ళంతా

డబ్బులిచ్చి పుస్తకం కొనుక్కున్నారు.ఈ రైటప్ చదివే వాళ్ళలో ఎవరైనా దొమ్మరి పుస్తకం కొనుక్కోవాలంటే మట్టి మనుషులు పబ్లిషింగ్ హౌస్ వారిని సంప్రదించండి.జయతి గారి మిగితా మూడు పుస్తకాలు

లోహితాక్షన్ బైసికిల్ డైరీస్ కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి.అక్కడి నుంచి సమావేశ

వేదిక ఓపెన్ స్థలంలోనికి మారింది.అప్పుడే నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ నివారణకు ఉద్యమాలు చేసిన దుశ్చర్ల సత్యనారాయణ, నల్గొండ సెయింట్ ఆల్ఫాన్సేస్ స్కూలు ఇంగ్లీషు ఉపాధ్యాయులు వెంకన్న

సమావేశ స్థలికి వచ్చారు.

ఓపెన్ గ్రౌండ్ లో సమావేశమైన సాహితీ మిత్రులు అందరూ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.చివరిగా ఫోటో సెషన్ ఆ తర్వాత సమావేశం ముగిసింది… దిమ్మరి పుస్తకాన్ని పూర్తిగా చదివి సమీక్షించేందుకు ప్రయత్నిస్తాను….

             ప్రమోద్ ఆవంచ

7013272452

post bottom

Leave A Reply

Your email address will not be published.