పేదల భూములపై పోలీసులు, రెవెన్యూ అధికారుల జూలూం
అధికారుల తీరును నిరసిస్తూ రెండు గంటల పాటు రాస్తారోకో..
ప్రజాలహరి ..
మండలంలోని జంకుతండలో బలవంతంగా, దౌర్జన్యంగా పోలీసుల దాడులతో పేదల భూములను లాక్కొనే ప్రయత్నంచడంతో పురుగుల మందు తాగి సోమవారం మహిళ ఆత్మహత్య చేసుకాగా ఆగ్రహించిన గ్రామ ప్రజలు,కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం జడ్చర్ల -కోదాడ జాతీయ రహదారిపై వెంకటాద్రిపాలెం గ్రామం వద్ద రెండు గంటలకు పైగా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధీరావత్ స్కైలాబ్ నాయక్ మాట్లాడుతూ మండలంలోని జంకుతండ గ్రామపంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 65లో ఉన్న ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా చూపించి పక్కనున్న సర్వే నెంబర్ కు జోడించి ప్రైవేట్ పట్టా చేయించుకుని గ్రామపంచాయతీ భవనం నిర్మాణానికి పూనుకోవడం తగదన్నారు. పేదల భూములను బలవంతంగా బలవంతంగా లాక్కోవాలనుకోవడం తగదన్నారు. కబ్జాలో ఉన్న గ్రామస్తులను , రైతులను,పట్టాదారులను బలవంతంగా పోలీసులు,రెవెన్యూ అధికారులతో అడ్డు తొలగించి ఆక్రమించుకోవాలనుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ విషయమై ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని విచారణ జరిపించాలని, అక్రమ పట్టా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్త పరిస్థితులు, ఆత్మహత్య యత్నం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో బలవంతపు ఆక్రమణలు, పోలీసుల దౌర్జన్యాలను నివారించాలని నివారించాలని సూచించారు.40 సంవత్సరాలుగా కబ్జాలో ఉన్న పేదలను బలవంతంగా ఖాళీ చేపిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.కార్యక్రమంలో బి,అర్,ఎస్ నాయకులు అశోక్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మేరవత్ విజయ్ నాయక్, హరి చంద్ నాయక్,గుండు, చీనా,రాజేందర్,హీరా, కౌసల్య, రామీ,శారద,రజినీ, సితాలి,పద్మ, తడతరులు ఉన్నారు.అనంతరం సమగ్ర విచారణ,సర్వే చేసిన అనంతరం గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి పూనుకోవాలని కోరుతూ ఆర్డీవో ఎంఆర్ఓ డీఎస్పీలకు వినతిపత్రాలు సమర్పించారు.