ప్రజాలహరి తిరుమల, 2023 సెప్టెంబరు 02
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు – 2023 వాహనసేవలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందుకోసం సెప్టెంబరు 17న అంకురార్పణ జరుగనుంది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబరు 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. వాహనసేవలు ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు జరుగుతాయి.
17.09.2023 – ఆదివారం – అంకురార్పణ – రాత్రి 7 నుండి 8 గంటల వరకు.
18.09.2023 – సోమవారం – బంగారు తిరుచ్చి ఉత్సవం – మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు.
ధ్వజారోహణం(మీన లగ్నం) – సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల వరకు.
పెద్దశేష వాహనం – రాత్రి 9 నుండి 11 గంటల వరకు.
19.09.2023 – మంగళవారం – చిన్నశేష వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
స్నపనతిరుమంజనం – మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు.
హంస వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
20.09.2023 – బుధవారం – సింహ వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
స్నపనతిరుమంజనం – మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు.
ముత్యపుపందిరి వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
21.09.2023 – గురువారం – కల్పవృక్ష వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
సర్వభూపాల వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
22.09.2023 – శుక్రవారం – మోహినీ అవతారం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
గరుడసేవ – రాత్రి 7 గంటలకు ప్రారంభం.
23.09.2023 – శనివారం – హనుమంత వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
స్వర్ణరథం – సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు.
గజ వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
24.09.2023 – ఆదివారం – సూర్యప్రభ వాహనం – ఉదయం 8 నుండి 10 గంటలకు వరకు.
స్నపనతిరుమంజనం – మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు.
చంద్రప్రభ వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
25.09.2023 – సోమవారం – రథోత్సవం- ఉదయం 6.55 గంటలకు.
అశ్వ వాహనం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
26.09.2023 – మంగళవారం – పల్లకీ ఉత్సవం మరియు తిరుచ్చి ఉత్సవం – ఉదయం 3 నుండి 6 గంటల వరకు.
స్నపనతిరుమంజనం మరియు చక్రస్నానం – ఉదయం 6 నుండి 9 గంటల వరకు.
ధ్వజావరోహణం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు.
——-