
ప్రజాలహరి హైదరాబాద్ … వ్యాయామము మించిన వైద్యం లేదు: బ్రహ్మకుమారి కుల్దీప్ దిదీజీ హైదరాబాద్: వ్యాయామం చేయడం వల్ల భవిష్యత్తులో వచ్చే ఎన్నో వ్యాధులు నివారించవచ్చని బ్రహ్మకుమారి శాంతి సరోవర్ హైదరాబాద్ డైరెక్టర్ బి.కె.కుల్దీప్ దిదీజీ తెలిపారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిట్నెస్స్ స్పోర్ట్స్ సైన్స్ అసోసియేషన్ (ఐ.ఎప్.పి.ఈ.పి.ఎస్.ఎస్.ఎ)ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో శనివారం ప్రారంభమైన వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ఎక్సైజ్ మెడిసిన్ 2023 ప్రారంభం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధి విచ్చేసి మాట్లాడారు. ఎక్సైజ్ కి మించిన మెడిసిన్ లేదని చెప్పారు. డయాబెటిక్స్, థైరాయిడ్, హద్రోగ సమస్యలను నివారించడానికి జీవితంలో ప్రతి ఒక్కరూ వాయము దినచర్యలో భాగంగా కావాలని ఆమె పిలుపునిచ్చారు. వ్యాయామానికి ముందు శరీరాన్ని మానసిక శరీరకంగా సిద్ధం చేయకపోవడం వలన బ్రెయిన్ డెడ్, హార్ట్ ఎటాక్ లో యువతలో ఎక్కువగా వస్తున్నాయని ప్రముఖ వైద్యుడు, మేజర్, డాక్టర్ భక్తి యార్ చౌదరి తెలిపారు. రోజుకు నాలుగు నుంచి ఐదు గంటలునిద్రలేమి వల్ల బిపీ350 నుంచి 500 కు పెరగడం దీనికి తోడు జీవనశైలి కారణంగా 25 నుంచి 49 మధ్య వయసు గల వారు ఎక్కువగా హార్ట్ ఎటాక్ గురవుతున్నారని ఆయన చెప్పారు. జీవిత సమతుల్యం లేకపోవడంతో పని ఒత్తిడి ఎక్కువ, నిద్ర తక్కువ కారణంగా అనేకమంది వివిధ రంగాల ప్రముఖులు నేడు హద్రేక సమస్యలతో మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. (ఐ.ఎఫ్. పి.ఈ. ఎఫ్.ఎస్. ఎస్.) అధ్యక్షుడు,వరల్డ్ కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ చైర్మన్ ప్రొఫెసర్ రాజేష్ కుమార్, మలేషియా ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ వనిత సుబ్రహ్మణ్యం, మలేషియా చెందిన డాక్టర్ లెస్సీ లై, పాలమూరు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎల్.బి. లక్ష్మీ కాంత్ రాథోడ్, శాతవాహన యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ జె. ప్రభాకర్ రావు, ప్రొఫెసర్ చిన్నపరెడ్డి, ప్రొఫెసర్ ఇబ్రహీం, మానసిక నిపుణులు డాక్టర్ శ్రీ వీరేందర్, ఇండియా అథ్లెటిక్స్ కోచ్ ద్రోణాచార్య అవార్డు రమేష్, తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు భారతదేశంతో పాటు మలేషియా, ఇటలీ, పిన్ ల్యాండ్, చేకోస్లియా. తైవాన్, నేపాల్, ఇండోనేషియా, థాయిలాండ్, దుబాయ్, సింగపూర్, బ్రూనై ,బంగ్లాదేశ్ ,పాకిస్తాన్, ఆస్ట్రేలియా దేశాల చెందిన యూనివర్సిటీస్ వ్యాయామ విద్య నిపుణులు, వైద్యరంగ ప్రముఖులు, డాక్టర్లు, క్రీడా శిక్షకులు అనేక దాదాపు 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.