Ultimate magazine theme for WordPress.

జానయ్యది నమ్మకద్రోహం బడుగుల లింగయ్య యాదవ్

Post top

నమ్మక ద్రోహం జానయ్య నైజం

 

నమ్మిన వారిని ముంచడం ఆయనకు అలవాటే

 

తప్పుచేసి కులానికి రుద్దడం తగదు

 

కన్నతల్లి లాంటి పార్టీ కి జానయ్య చేసిన ద్రోహం చారిత్రక తప్పిదం

 

ప్రతిపక్షాల తో చేతులు కలిపిన యాదవ ద్రోహి జానయ్య

 

యాదవవనం లో పుట్టిన గంజాయి మొక్క జానయ్య

 

మంత్రి జగదీష్ రెడ్డి లింగమంతుల స్వామి స్వరూపం

 

రాజకీయంగా యాదవులను గుర్తించింది జగదీష్ రెడ్డి నే

 

యాదవ బిడ్డలను ఎమ్మెల్యేలుగా, రాజ్యసభ సభ్యుడిగా, డిసిఎంఎస్ చైర్మన్ గా చేసింది జగదీష్ రెడ్డి నే

 

బిఆర్ఎస్ లో ఉంటూ పార్టీని దెబ్బ కొట్టాలని చూస్తే ఊరుకునేది లేదు

*యాదవుల ఆత్మీయ సమావేశంలో వక్తలు*

➖➖➖➖➖➖➖➖➖➖

కబ్జా కోరు వద్దు.. జగదీష్ అన్న ముద్దు అని నినదించిన యాదవ సమాజం

 

మంత్రి కి జగదీష్ రెడ్డి కి మద్దతుగా ఏకమైన యాదవ సోదరులు

 

మంత్రి వెంటే మా పయనం అంటూ తీర్మానం

 

యాదవ సమ్మేళనానికి తరలి వచ్చిన యాదవ బంధువులు

➖➖➖➖➖➖➖➖➖➖

యాదవ వనం లో పుట్టిన గంజాయి మొక్క డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ అనీ,నమ్మక ద్రోహమే ఆయన నైజం అని యాదవ

ప్రజాప్రతినిధులు, యాదవసోదరులు తీవ్ర స్థాయి లో మండిపడ్డారు. సూర్యాపేట లోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియం లో జరిగిన యాదవుల ఆత్మీయ సమావేశం లో మంత్రి జగదీష్ రెడ్డి కి మద్దతు గా యాదవ సోదరులుఏకమయ్యారుఈసందర్భంగా వక్తలు మాట్లాడుతూ, నమ్మిన వారిని నట్టేట ముంచడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. ప్రేమతో మంత్రి జగదీష్ రెడ్డి గారు జిల్లా పదవి ఇస్తే, కన్న తల్లి లాంటి పార్టీకే ద్రోహం చేయడం జానయ్య మోసపూరిత మనస్తత్వానికి నిదర్శనం అన్నారు.

ఇతర పార్టీలతో చేతులు కలిపి

తప్పుచేయడమే కాకుండా ఆ తప్పును కులానికి రుద్దడాన్ని యావత్ యాదవ సమాజం ముక్తకంఠంతో ఖండిస్తున్నామన్నారు. నమ్మి పదవి ఇచ్చిన మంత్రి జగదీష్ రెడ్డి గారికి ,కన్నతల్లిలాంటి బీఆర్ఎస్ పార్టీ కి జానయ్య చేస్తున్న ద్రోహం చారిత్రక తప్పిదం అన్నారు. చరిత్ర లో

యాదవ ద్రోహి గా వట్టే జానయ్య పేరు చిరస్థాయిగా నిలబడటం ఖాయం అన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి లింగమంతుల స్వామి స్వరూపం అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా లో రాజకీయంగా యాదవులను గుర్తించింది జగదీష్ రెడ్డి నే అన్నారు.

యాదవ బిడ్డలను ఇద్దరినీ ఎమ్మెల్యేలుగా, రాజ్యసభ సభ్యుడిగా, జానయ్య ను డిసిఎంఎస్ చైర్మన్ గా చేసిన యాదవ పక్షపాతి మంత్రి జగదీష్ రెడ్డి గారు అని అన్నారు. బిఆర్ఎస్ లో ఉంటూ పార్టీని దెబ్బ కొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

 

**కబ్జా కోరు వద్దు.. జగదీష్ అన్న ముద్దు*

……

నినదించిన యాదవ సమాజం

 

ఆత్మీయ సమావేశానికి వందలాది గా తరలి వచ్చిన యాదవ సోదరులు కబ్జా కోరు వద్దు.. జగదీష్ అన్న ముద్దు అంటూ నినదించారు.మంత్రి జగదీష్ రెడ్డి కి మద్దతుగా ఏకమైన యాదవ సోదరులు, జగదీషన్న వెంటే మా పయనం అంటూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇద్దరు శాసన సభ్యులను, వందల కోట్లు ఇచ్చినా ఇవ్వని రాజ్యసభ సభ్యుడి పదవిని ఒక చాయ్ ఖర్చు లేకుండా యాదవ బిడ్డకు ఇప్పియడం యాదవుల పట్ల ఆయనకు ఉన్న గౌరవానికి నిదర్శనం అన్నారు. యాదవ బిడ్డ వట్టే జానయ్య యాదవ్ కు కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసీఎంఎస్ చైర్మన్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి , మెప్పించి మంత్రి జగదీశ్ రెడ్డి నియమించారనిఅన్నారు. తనకు ప్రాణహాని ఉందన్న సమయంలో సైతం మంత్రి జగదీష్ రెడ్డి గన్మెన్ కూడా ఇచ్చారని అన్నారు. అలాంటి వ్యక్తి కి ద్రోహం చేయడం హెయం అని పేర్కొన్నారు.అన్నం పెట్టిన ఇంటికే కన్నం పెట్టిన నీచుడు డీసీఎంఎస్ చైర్మన్ జానయ్య యాదవ్ అని, యాదవ కులానికి మచ్చ తెస్తున్నారంటూ జానయ్య యాదవ్ తీరును యాదవ సోదరులు తప్పు పట్టారు . డీసీఎంఎస్ చైర్మన్ పదవిని కట్టబెట్టిన మంత్రిపైనే జానయ్య కక్ష పెంచుకోవడం అవివేకమన్నారు. మంత్రిపై ఆరోపణలు చేయడమంటే.. అన్నం పెట్టిన ఇంటికే సున్నం పెట్టడం లాంటిదన్నారు. జానయ్య నమ్మక ద్రోహి అని, మంత్రి సీటుపైనే కన్నేసిన స్వార్థపరుడన్నారు. నేటికీ కొందరు యాదవులు ఏదో జరిగిపోతోందని ఆవేశపడిపోతున్నారనీ, ..ఒక్క విషయం యాదవులంతా ఖచ్చితంగా ఆలోచించాలన్నారు. ఒకరిద్దరి స్వార్థ ప్రయోజనాల కోసం మన జాతిని బలి చేయొద్దని, యాదవ జాతి నమ్మకానికి మారుపేరన్నారు. యాదవ కులం ఖచ్చితంగా నీతి, న్యాయం, ధర్మం వైపు ఉండాలన్నారు. జానయ్య రాజకీయ అధికారం కోసం, పదవుల కోసం మనమంతా బలి కావొద్దని హితవు చెప్పారు. అవసరమైతే జానయ్యను కుల, సామాజిక బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నామన్నారు. జానయ్య ఒక్కని పదవి కోసం మొత్తం కులానికి ఏదో జరిగిపోయినట్లు కాదన్నారు. లింగయ్య యాదవ్ కు ఎంపీతో పాటు పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు ఇచ్చి మంత్రి గౌరవించలేదా? అన్నారు. ఇద్దరు ఎమ్మల్యేలకు టికెట్లు ఇచ్చింది నిజం కాదా? అన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి తనకు మంచి గుర్తింపు ఇచ్చాడని, గొప్పోన్ని చేశాడని మంత్రితో మంచిగా ఉన్నన్ని రోజులు.. జానయ్య యాదవ్ ఎన్నో వేదికలపై చెప్పాడన్నారు. అప్పుడు జానయ్యకు దేవుడిగా కనిపించిన మంత్రి ఇవాళ.. దయ్యమెలా అయ్యాడో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. మంత్రి తలచుకుంటే జానయ్య ఎక్కడున్నాడో రప్పించడం పెద్ద పనేమీ కాదన్నారు. కానీ.. కక్ష సాధింపు చేసే వ్యక్తిత్వం మంత్రి జగదీష్ రెడ్డిది కాదన్నారు. అధికారం ఉన్నా.. మంత్రి ఏరోజూ ఎవర్నీ రెచ్చగొట్టలేదన్నారు. కులానికి చీడలా మారిన వ్యక్తుల కోసం మనం వెంపర్లాడాల్సిన అవసరం లేదన్నారు. నమ్మకానికి మారుపేరైన యాదవ కులం.. ఖచ్చితంగా నమ్మకం వైపే నిలబడాలన్నారు. రాజకీయంగా అవకాశం ఇచ్చిన మంత్రిపైన జానయ్య అవాకులు, చవాకులు పేలడం మానుకోవాలని హెచ్చరించారు. జానయ్య వేరే పార్టీలోకి వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చు.. కానీ.. ఇలా నోటికొచ్చినట్లు విమర్శలు చేయడం పద్ధతి కాదన్నారు. జానయ్య తల్లి, భార్యతో విమర్శలు చేయించడం అస్సలు సంస్కారం కాదన్నారు. జానయ్య రాజకీయ స్వార్థం కోసం మంత్రిపై చేస్తున్న విమర్శలను సమైక్యంగా తిప్పి కొట్టాలన్నారు. యాదవ జాతి ఐక్యతను నిలబెట్టేలా మన ఆలోచనలు, ప్రవర్తన ఉండాలని విజ్ణప్తి చేశారు. ఎప్పుడు కూడా మంత్రి జగదీష్ రెడ్డి యాదవ కులానికి ఇబ్బంది కలిగేలా మాట్లాడలేదన్నారు. తనకు రాజకీయ జన్మ ఇచ్చిన మంత్రి గురించి మాట్లాడేటప్పుడు జానయ్య నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. సోషల్ మీడియాలో మంత్రిపై జానయ్య విమర్శలు చేసిన తర్వాత మాత్రమే.. అతని బాధితులు పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కారు తప్ప.. ఇది మంత్రి చేయించింది కాదని, చేసింది కానే కాదన్నారు. ఈ వాస్తవాన్ని యాదవులందరూ గమనించాలన్నారు.మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ని ఓడించాడని, జానారెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డిల గెలవనియట్లేదనే కోపంలో మంత్రి జగదీష్ రెడ్డిని ఇక్కడ ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.బిజెపి, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న కుట్రలో వట్టే జానయ్య యాదవ్ ఇరుక్కున్నాడని ఆరోపించారు. బిఆర్ఎస్ లో ఉంటూ పార్టీని దెబ్బ కొట్టాలని చూస్తే ఎంతటి వారైనా ఏ కులం వారైనా ఊరుకునేది లేదని హెచ్చరించారు..యాదవుల ఆరాధ్యదైవమైన పెద్ద గట్టు లింగమంతుల స్వరూపం మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆయన వచ్చాకే పెద్ద గట్టు లింగమంతుల స్వామి ప్రాశ్యస్థ్యం పెరింగిందన్నారు. జాతర నిర్వహణకు పది కోట్ల నిధులు తెచ్చిన గొప్పతనం జగదీష్ రెడ్డి గారికే దక్కుతుందని అన్నారు.రేపు వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు 12 స్థానాలు గెలుస్తామని అన్నారు. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాయ మాటలు చెప్పేవాళ్లను నమ్మకుండా మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో యాదవులమంత కలిసికట్టుగా ముందుకు పోదామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, దావుల వీరప్రసాద్ యాదవ్, పెద్ద గట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్, బత్తుల లక్ష్మిజానీయాదవ్,మన్నే లక్ష్మీ నరసయ్య యాదవ్, కోడి సైదులు, జటంగి వెంకటేశ్వర్లు, చౌడయ్య యాదవ్, గొద్దేటి సైదులు, కడారి సతీష్ యాదవ్, మట్ట రాజు యాదవ్, మద్ది శ్రీనివాస్ యాదవ్, మండది కృష్ణ, ఆయా మండలాల యాదవ ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు ఉన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.