వేములపల్లి, ప్రజాల హరి..
విద్యార్థుల శారీరక మానసిక వికాసానికి క్రీడలు దోహద పడతాయని మండల పరిషత్ అధ్యక్షులు పుట్టల సునీత , ZPTC ఇరుగు మంగమ్మ లు పేర్కొన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేములపల్లి నందు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ కోకో వాలీబాల్ క్రీడా పోటీలను ప్రారంభిస్తూ కరోనా తర్వాత విద్యార్థులు క్రీడలకు దూరమై సెల్ ఫోన్లు టీవీలకు దగ్గర చెడు అలవాట్లకు గురవుతున్నారని క్రీడల పట్ల ఆసక్తిని పెంచి శారీరక మానసిక వికాసాన్ని పెంచుటకు ఉపాధ్యాయుల కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బహుమతుల దాత స్థానిక సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్, ఉపాధ్యక్షురాలు పాదూరి గోవర్ధని, మండల విద్యాధికారి ఎం బాలాజీ నాయక్, మండల స్థాయి క్రీడల కన్వీనర్ స్థానిక ప్రధానోపాధ్యాయురాలు అరుణకుమారి, మండల నోడల్ అధికారి ఎం మంగళ, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటరెడ్డి సైదులు తదితరులు పాల్గొన్నారు