ప్రజావ్యతిరేక విధానాలపై సెప్టెంబర్ ఒకటి నుంచి నిరసన కార్యక్రమాలు
* విలేకరుల సమావేశం జూలకంటి
మిర్యాలగూడ, ప్రజాలహరి….
ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ ఒకటి నుండి 10వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను ఎండగట్టి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని సామాన్యులు జీవించలేని పరిస్థితి నెలకొందన్నారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినోత్సవం గా ప్రభుత్వ అధికారికంగా నిర్వహించాలని నిర్మాణం చేశారు. ఎంతోమంది ప్రాణ త్యాగాలు ఫలితంగా తెలంగాణ రాజ్యాన్ని దేశంలో విలీనం చేశారని అందులో హిందువులు ముస్లింలు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. దీనిని కొన్ని మతతత్వ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు డా. మల్లు గౌతమ్ రెడ్డి, భవాండ్ల పాండు, రాగిరెడ్డి మంగా రెడ్డి, తిరుపతి రామ్మూర్తి,పాల్వాయి రాంరెడ్డి, చిరుమళ్ల బిక్షం, రామారావు తదితరులు పాల్గొన్నారు.