*మైనార్టీల సంక్షేమంలోనూ.. మనమే ఆదర్శం..*
*కులమతాల ఐక్యతను పెంచిన ఘనత సీఎం కేసీఆర్ దే..*
*నాడు మైనార్టీలు కేవలం ఓటు బ్యాంకు గా మాత్రమే చూసిండ్రు..*
*నేడు అన్ని మతాలను అక్కున చేర్చుకుని అండగా నిలుస్తున్నం..*
*దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళిత బంధు..*
*పేదలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు బీసీ, మైనార్టీ రుణాలు..*
*# రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి..*
*పేటలో 45 మంది మైనార్టీలకు 100 శాతం సబ్సిడీ చెక్కుల పంపిణీ..*
సూర్యాపేట ప్రజాలహరి… అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడంతో పాటు మైనార్టీల సంక్షేమంలోనూ తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. కులమతాల ఐక్యతను పెంచిన ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ కె దక్కుతుందని ఆయన కొనియాడారు. సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన 45 మంది లబ్దిదారులకు 100 శాతం సబ్సిడీతో కూడిన ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్కులను ఆదివారం సాయంత్రం మంత్రి క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాడు ఉమ్మడి పాలనలో మైనార్టీలకు కేవలం ఓటు బ్యాంకు గా మాత్రమే వాడుకుని కుల మత పంచాయతీలను ప్రోత్సహించారు తప్ప వారికి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. కానీ నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యతను కల్పించి అక్కున చేర్చుకుని అండగా నిలుస్తున్నామన్నారు. మైనార్టీలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నో ప్రత్యేక నిధులు వెచ్చించి వారిని ఆదుకుంటున్నారు. మైనారిటీలు అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచనతో మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేసి వారిని విద్యలో పురోభివృద్ధి చెందటానికి ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. వారి అభివృద్ధికి చదువు ఎంతో ఉపయోగపడుతుందని ఆలోచనతో గురుకులాలను పెట్టి వారి ని ఆదుకుంటున్నారన్నారు. వివిధ వృత్తులలో ఉన్న కడు పేద వారిని ఆర్థికంగా ఆదుకుంటూ ఉన్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే మాత్రమే అని మంత్రి పేర్కొన్నారు. దేశంలో 40 శాతం ప్రజలు ఒక పూట మాత్రమే తింటున్నారని, తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు రెండు పూటలా హారాన్ని తీసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారన్నారు. కేంద్రం సహకరించుకున్న ప్రతి మనిషికి 6 కేజీల బియ్యాన్ని అందిస్తూ మైనార్టీలలోని నిరుపేదలని ఆదుకుంటున్నారని మంత్రి తెలిపారు. సహాయాన్ని అందించే ప్రభుత్వాన్ని అంతా దీవించాలని, అండగా నిలవాలని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు సూర్యాపేట జిల్లాలో 138 మంది మైనారిటీలకు ఆర్థిక సహాయం కింద లక్ష రూపాయల చెక్కులను అందజేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట జడ్పీ వైస్ చైర్మన్ వెంకట్ నారాయణ గౌడ్, జెడ్పిటిసి జిడిబిక్షం, డి ఎండబ్ల్యూఓ శంకర్, నాయకులు మర్ల చంద్రారెడ్డి జూలకంటి జీవన్ రెడ్డి, శ్రీనివాసరావు, జీవన్ రెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకులు అజీజ్, రియాజ్, షాహిద్ మౌలానా, సయ్యద్, తాహెర్, సల్మా మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.