ప్రజాలహరి ఖమ్మం..భాజపా, బారాస ఎప్పటికీ ఒకటి కాదని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఖమ్మంలో జరిగిన భాజపా రైతు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఐ ఎం ఉన్న సభలోనే తాము కూర్చోమని అటువంటిది ఎట్లా పొత్తు పెట్టుకుంటామని అమిత్ షా ప్రశ్నించారు. భారత రాష్ట్ర సమితి పరిపాలన మొత్తం ఓ వైసి చేతిలో ఉందని పేర్కొన్నారు. ఇద్దరు కలిసి తెలంగాణ అమరవీరుల అవమానిస్తున్నారని ఇటువంటి తరిమి తరిమి కొట్టాలనిపిలుపునిచ్చారు. రానున్న కాలంలో తెలంగాణలో భాజపా ప్రభుత్వం వస్తుందని చెప్పారు. రైతు సంక్షేమానికి భాజపా పెద్దపీట వేస్తుందని తెలంగాణలో పండిన పంట మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని వాస్తవాలు దాచి భాజపా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వివరించారు. అనాదిగా భద్రాచలం సీతారామచంద్రునికి పట్టు వస్త్రాలు ను రాష్ట్ర ప్రభుత్వం తరలించే విధానము ఉండేదని ఆ సంస్కృతిని కెసిఆర్ తొంగ లో తొక్కి ఆయన మనవడు , మంత్రుల చేత స్వామి వారికి పట్టు వస్త్రాలు పంపిస్తున్నాడని ఇటువంటి హేతువాదిని తరిమికొట్టాలన్నారు. ఎన్నికల అనగానే కెసిఆర్ కు వరాలు హామీలు గుర్తుకొస్తాయని చెప్పారు. ప్రజా విద్రోహక కంటగా ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి అన్నారు. భాజపా ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ లో తాగుబోతుల రాజ్యం నడుస్తుందని పేర్కొన్నారు .భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ కౌలు రైతులను అన్యాయం చేస్తున్నా ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని విమర్శించారు. హైకోర్టు ఉత్తర్వులు ద్వారా నియామకమైన గద్వాల ఎమ్మెల్యే గా డీకే అరుణ ను అమీత్ షా సన్మానించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.