
మిర్యాలగూడ కాంగ్రెస్ కు సరైన లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి.
ప్రజాలహరి మిర్యాలగూడ…
మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ జవజీవాలతో ఉండాలంటే బత్తుల లక్ష్మారెడ్డి సరైన లీడర్. సంవత్సరానికి ఒకసారి వచ్చే తుఫాను లాగ వచ్చిపోయే లీడర్లతో కాంగ్రెస్ పార్టీకి మిర్యాలగూడలో ఇసుమంత ప్రయోజనం లేదు. ఎన్నికలవేళలో అందరూ టికెట్ల కోసం రావడం పోవడం పరిపాటే కానీ నిత్యము ప్రజలు అందుబాటులో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను ఇమ్మడింపజేసే నాయకులు కొందరు .అందరి లో కొందరులా ఒక్కడు బత్తుల లక్ష్మారెడ్డి. అధికారం లేకున్నా పది సంవత్సరాలుగా పార్టీని అంటి పెట్టుకుంటూ పార్టీ కోసం నిత్యము కార్యక్రమాలు చేస్తున్న లక్ష్మారెడ్డి కాదని వేరే ఎవరికీ టికెట్ ఇచ్చినా అధికార పార్టీ గెలుపు కోసం పని చేసినట్లు అవుతుంది. మితిమీరిన స్వేచ్ఛ వల్ల ఎవరికి వారు టికెట్ల కోసం దరఖాస్తులు చేయడం పరిపాటయింది కాంగ్రెస్లో. ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే స్థాయిలో నియోజకవర్గాల్లో ప్రజలతో సంబంధాలు, కార్యకర్తలు సంబంధాలు కార్యకర్తలను గుర్తుపట్టే కెపాసిటీ ఉండగలిగిన నాయకులు మాత్రమే గతంలో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేసేవారు. ఇప్పుడు ఒక గ్రామస్థాయి నాయకులు సైతం ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేస్తూ పార్టీ ప్రతిష్టను మరింత తగ్గిస్తున్నారు. మిర్యాలగూడలో మున్సిపాలిటీ కీలక భూమి పోషిస్తుంది. ఒకటి, రెండు సీట్లతో చైర్మన్ పదవి కాంగ్రెస్ చేయి జారింది .ఆనాడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు టికెట్ కోసం చేస్తున్న నాయకులు ఎవరు పార్టీ కోసం పనిచేయలేదు .ఇప్పుడు మాత్రం ఎలక్షన్స్ రాగానే టికెట్ల కోసం దరఖాస్తు చేయడం పత్రికలకు రిలీజ్ చేయడం చేస్తూ తమ గొప్పలు వాళ్లే చెప్పుకుంటున్నారు. వాస్తవంగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థులను నిర్ణయించాలంటే జిల్లా పార్టీ, నియోజకవర్గ స్థాయిలో ఉన్న ముఖ్య నేతలు అందరూ కూర్చొని ప్రత్యర్థులు ఎవరు ఉంటారు వారి మీద ఎవరు సమర్ధుడు అని నిర్ణయించి ఆర్థికంగా, కార్యకర్తలను కలుపుకొని పోయే నాయకుడు ఎవరు నిర్ధారించి వారికి టికెట్ ఇవ్వాలని హై కమాండ్ కు సూచనలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. సొంత పార్టీని ఓడించడానికి చోటా మోటా నాయకులంతా తము ఎమ్మెల్యే అభ్యర్థులని టికెట్ల కోసం దరఖాస్తు చేస్తూ ప్రజల్లో, ప్రతిపక్షంలో పార్టీని చులకనగా చేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాలను పరిశీలిస్తే అధికార పార్టీని ఎదురుకోవడానికి భక్తుల బత్తుల లక్ష్మారెడ్డి కొంతమేరకు సమర్ధుడుగా కనిపిస్తున్నారు. గత ఎనిమిది నుంచి పది సంవత్సరాల మధ్యన పలు సేవా కార్యక్రమాలు చేస్తూ మిర్యాలగూడ మున్సిపాలిటీలో 21 కౌన్సిల్ సీట్లో సాధనలో ప్రధాన గ్రామపంచాయతీలో సాధించటం లో బిఎల్ఆర్ కృషి ప్రశంసనీయము. కుల పరంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఆయన గెలుపుకు ఉపయోగపడతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ లు మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం బిఎల్ఆర్ కు టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.