అభాగ్యులకు గృహలక్ష్మి పథకం అందని ద్రాక్షలా మారింది.
వేములపల్లి (ప్రజాలహరి) తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల కోసం గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది అట్టి పథకం నిరుపేదలకు అందని దాక్షలా మారిందని పలువురు నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని ప్రతి నిరుపేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి గాను 3 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి అట్టి డబ్బులను మూడు విడుదలగా అందజేస్తామన్నారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో నిరుపేదలను గుర్తించకుండా గతంలో దళిత బంధు, పార్టీ కార్యకర్తలకు ఇచ్చినట్టుగా నేడు గృహలక్ష్మి పథకాన్ని కూడా వారి ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండలంలోని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఇట్టి పథకానికి గాను జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉంటాడు, గ్రామంలోని నిరుపేదలైనటువంటి వారిని సంబంధిత స్థానిక క్షేత్రస్థాయి అధికారులు గుర్తించాల్సిన ఉండగా వారు కామాటీలను, పార్టీ కార్యకర్తలను ఇండ్ల వద్దకు తోలి వారి పేర్లను నమోదు చేసుకుంటున్నారు. దీంతో సంబంధిత అధికారి పార్టీలో సైతం తిరుగుబాటులో తిరుగుబాటు లేస్తుందని కొంతమంది మేధావులు వాపోతున్నారు. ఏది ఏమైనప్పటికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను ప్రవేశపెట్టి ఇల్లు లేని ప్రతి నిరుపేదలకు ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి ఇండ్లు మంజూరు చేయాలని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఎప్పటికిని క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటువంటి సంక్షేమ పథకాలను నిరుపేదలకు అందేటట్టుగా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని పలు గ్రామాల ప్రజలు అధికారులకు సూచిస్తున్నారు. ఇట్టి విషయంపై సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు గ్రామంలో ఇల్లులు తిరిగి వాస్తవంగా ఎవరికైతే ఇల్లు అవసరం ఉందో వారికి ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఇండ్ల మంజూరి విషయంలో అవసరమైన వారికి మంజూరు చేయాలని ఇల్లు లేని నిరుపేదలు కోరుతున్నారు