గృహలక్ష్మి పథకం కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
వేములపల్లి (ప్రజాలహరి) రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ఇల్లు లేని నిరుపేదలు ఇల్లు నిర్మించుకోవాలని ఉద్దేశంతో గృహలక్ష్మి పథకాన్ని వెలుగులోకి తెచ్చింది, అట్టి పథకం పేరు గృహలక్ష్మి కాకుండా టిఆర్ఎస్ లక్ష్మి అని అంటే బాగుంటుందని వేములపల్లి ఎంపీపీ సునీత తీవ్రస్థాయిలో విమర్శించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం శనివారం ధర్నా నిర్వహిస్తున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పేద ప్రజలకు అందకుండా ఒక టిఆర్ఎస్ పార్టీకి అందడం చాలా దురదృష్టకరమని ఆయన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదనంతరం ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి పథకాలను పేద ప్రజలకు కాకుండా ఒక టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడం చాలా దురదృష్టకరమని అన్నారు. అంతేకాకుండా బీసీ బందు పెట్టి మొదటి విడతగా ఐదుగురికి ఇచ్చి మిగతా వారికి మొండి చేయించుకోవడం చాలా దుర్మార్గం అని ఎద్దేవా చేశారు ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న ఎలాంటి పథకాలు తీసుకొచ్చిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కాకుండా పార్టీలకతీతంగా ప్రతి పేద ప్రజలకు అందే విధంగా చూడాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం తాసిల్దార్ వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్గొండ డీసీసీ ఉపాధ్యక్షులు రావు ఎల్లారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టల కురుపయ్య, మిర్యాలగూడ నియోజకవర్గ ఓ బి సి ఉపాధ్యక్షులు నాగవెల్లి కృష్ణ, ఐ ఎన్ టి సి మండల ప్రెసిడెంట్ రమణ చారి, మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దైదగిరి, ఆమనగల్ సర్పంచ్ వల్లంపట్ల ఝాన్సీ ప్రవీణ్, శెట్టిపాలెం పిఎసిఎస్ డైరెక్టర్ బుసిరెడ్డి వెంకటరెడ్డి, వేములపల్లి చెట్టి పాలెం గ్రామ శాఖ అధ్యక్షులు పల్లా వెంకన్న, పుట్టల వెంకన్న, రాములు పేట మాజీ సర్పంచ్ శ్రీనివాస్, చక్కని సత్యం, పాండు, మైనార్టీ నాయకులు సోహెల్, అన్ను, నవీన్, మహమూద్, తదితరులు పాల్గొన్నారు