డాక్టర్ లీడర్ అయిన వేళ..
ప్రజాలహరి జనరల్ డెస్క్ …. కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీకార్యాలయంలో తిలక్ నగర్ హాస్పిటల్
ఓనర్ డాక్టర్ కిషన్ రావు,మహబూబ్ నగర్ జిల్లా ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రామ్మోహన్ గార్లతో సహా కరీంనగర్ నుంచి వచ్చిన అనేక మంది ప్రాక్టీసింగ్ డాక్టర్లు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడానికి హాజరైయ్యారు.కరీంనగర్ ఐఎంఏ ప్రెసిడెంట్ రాంకిరణ్ సీనియర్ డాక్టర్ కిషన్,ఫిజీషియన్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఇంకా ఎక్కువగా కరీంనగర్ టౌనులో ప్రాక్టీస్ చేసే డాక్టర్లతో హాలు కళ కళలాడింది.డాక్టర్ బి.ఎన్.రావు
ఆధ్వర్యంలో తెలంగాణాలోనీ, వివిధ జిల్లాల ఐఎంఏ అధ్యక్షులతో సహా దాదాపుగా వంద మంది డాక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి హరీశ్ రావు,కరీంనగర్ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్, తదితరులు వేదికపై ఆసీనులైయ్యారు.
మొదట మంత్రి హరీష్ రావు, డాక్టర్ బి.ఎన్.రావు కు
గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఆ తరువాత మిగితా డాక్టర్లు కూడా గులాబీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.డాక్టర్ బి.ఎన్.రావు, మంత్రి
హరీశ్ రావులు మాట్లాడాక కార్యక్రమం ముగిసింది.