దళిత, గిరిజన డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్…. ప్రజాలహరి జనరల్ డెస్క్.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నిర్వహించిన భారీ బహిరంగ సభలో దళిత, గిరిజన డిక్లరేషన్ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే మాట్లాడుతూ విపక్షాల ఐక్యతతో మోడీని గదించాలని పోరాడుతున్నామని అందుకు కేసీఆర్ మాత్రం కలిసి రావడం లేదని విమర్శించారు .స్వాతంత్రానికి పూర్వం ఉన్న చిన్న రాజ్యాలను చిన్న సంస్థానాలను ఒకటిగా తీసి అఖండ భారతాన్ని ఏర్పాటు చేశామని ఆ విషయాన్ని ఇప్పుడు అందరూ మర్చిపోయారని కాంగ్రెస్ పార్టీపై లేనిపోని పసలైన ఆరోపణ చేస్తున్నారని పేర్కొన్నారు దళితులు గిరిజనులు కోసము 12 డిక్లరేషన్లు ప్రకటిస్తున్నామని తమ అధికారం రాగానే వీటిని అమలు చేస్తామని వివరించారు భారత రాష్ట్ర సమితి- భాజపా లు అంతర్గతంగా దోస్త్ అని విమర్శించారు. పైకి మాత్రం ఒకరిని ఒకరు తిట్టుకుంటారని లోపల ఇద్దరు ఒకటేనని వివరించారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరిన వెంటనే సోనియా గాంధీ ప్రజల కోరిక మేరకు తెలంగాణ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. అటువంటి తెలంగాణ కు కాంగ్రెస్ చేసిన సేవలను గుర్తించకుండా కాంగ్రెస్ ఓడించారని ఇది సరైన విధానం కాదన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ప్రజల గుర్తించి కాంగ్రెస్ ఈసారికి పట్టం కట్టాలని కోరారు. ఎస్సీలకు 18 శాతం ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని, ఐదు ఐటిడీఏలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు పదవ తరగతి పాస్ అయిన ఎస్టి ఎస్సీలకు విద్యార్థులకు10000 రూపాయలు ఇంటర్మీడియట్ 15000 డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి 25 వేల రూపాయలు పీజీ పాస్ అయితే లక్ష రూపాయలు వారికి ఉచిత భోజన వసతి ఏర్పాటు చేస్తామని నేను ఏండ్లుగా ఎస్సీలు కోరుతున్న ఏబిసిడిలు వర్గీకరణ పక్షం అమలు చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ యోజన పథకం కింద ఎస్సీ ఎస్టీలకు 12 లక్షల రూపాయలు ఆర్థిక సాయం, ఇద్దరమ్మా పథకం కింద ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు గృహ నిర్మాణానికి సహాయము చేయనున్నట్లు పేర్కొన్నారు.