మిర్యాలగూడ ప్రజాలహరి…
బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతోంది అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు, మిర్యాలగూడ పట్టణం రామచంద్రగూడెంలోని S.V గార్డెన్స్ నందు మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన 300 మంది లబ్ధిదారులకు బీ.సీ బంధు ద్వారా కుల వృత్తిదారులకు ఒక లక్ష రూపాయల చొప్పున మంజూరైన మొత్తం 3 కోట్ల రూపాయల విలువ గల చెక్కుల పంపిణి కార్యక్రమం నిర్వహించారు…ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొని స్థానిక శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తో కలిసి లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు మాట్లాడుతూ కులవృత్తులను కాపాడటంతో పాటు వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం ఆర్థిక చేయూతనందిస్తున్నదని, గత ప్రభుత్వాలు కులవృత్తులను పట్టించుకోలేదన్నఆయన, ఆయా పార్టీలు చేసే దుష్ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలిపారు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ సీ.ఎం కే.సీ.ఆర్ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని, అలాగే మూడో సారి కూడా మిర్యాలగూడ ఎమ్మెల్యేగా భాస్కర్ రావు ని ఆశీర్వదించి, అత్యదిక మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు…అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా 29 మందికి సి.యం సహాయనిది ద్వారా మంజూరు అయిన 13 లక్షల 98 వేల విలువ గల చెక్కులను లబ్దిదారులకు అందజేసారు…ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి , మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ , రైతు బంధు సమితి జిల్లా అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , D.C.M.S జిల్లా వైస్ చైర్మన్ దుర్గం పూడి నారాయణ రెడ్డి, మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ బైరం బుచ్చయ్య, వైస్ చైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ చైర్మన్ చిట్టిబాబు, ఆర్.డి.ఓ చెన్నయ్య, జడ్పీటీసీ అంగోతు లలిత హతిరాం, ఇరుగు మంగమ్మ-వెంకటయ్య, కుర్ర సేవ్యా నాయక్, ఎంపీపీ నూకల సరళ హనుమంత్ రెడ్డి, పోకల శ్రీవిద్య-రాజు, ధీరావత్ నందిని రవితేజ, ధనవత్ బాలాజీ నాయక్, జిల్లా కో ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, నాయకులు యం.డి యూసుఫ్, షైక్ మదార్ బాబా, అన్నభిమోజు నాగార్జున చారి, మిర్యాలగూడ మండల రైతు బంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, మార్కెట్ డైరెక్టర్లు వేలిశెట్టి రామకృష్ణ, పత్తిపాటి నవాబ్, కట్టా మల్లేష్ గౌడ్, చలికంటి యాదగిరి, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, మండల పార్టీ అద్యక్షులు పాలుట్ల బాబయ్య, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, మట్టపల్లి సైదులు యాదవ్, DCCB డైరెక్టర్ బంటు శ్రీనివాస్, జిల్లా బి.సి సంక్షేమశాఖ అధికారులు, MPDOలు, పట్టణ కౌన్సిలర్లు, వార్డ్ ఇంచార్జీలు, వార్డ్ అద్యక్షులు, గ్రామ సర్పంచ్లు, ఎం.పీ.టీ.సీలు, ఉప సర్పంచ్లు, గ్రామ పార్టీ అద్యక్షులు, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు..