మిర్యాలగూడ బైపాస్ రోడ్డు ఈదులగూడెం Y- జంక్షన్ వద్ద వాహన తనిఖీ చేస్తుండగా, పసుపులేటి సాయినాథ అను వ్యక్తి అతని యొక్క Honda Activa నెంబర్: AP-39-KX-0936 మీద అనుమానస్పదంగా అద్దంకి వైపు నుండి మిర్యాలగూడ టౌన్ లోపలికి వచ్చే క్రమములో, వాహన తనిఖీ చేస్తున్న పోలీసు వారిని చూసి ఒక్కసారిగా అతని స్కూటీ ని వెనక్కి తిప్పి పారిపోబోగా, పోలీసు వారు అతనిని పట్టుబడి చేసి తమదైన శైలిలో విచారించగా అతడు తేది: ఈనెల 24న రోజున మధ్యాహ్నం ముతి రెడ్డికుంట కు చెందిన మునుగోటి వరమ్మ అనే మహిళ మెడలోనుండి రెండు వరుసల 3 తులాల బంగారపు నాంతాడు ను గుంజుకొని దొంగిలించుకొని పోయానని ఒప్పుకున్నాడనీ , ఇదే కాకుండ గతములో2017 సంవత్సరం నుండి ఇప్పటివరకు నగరంపాలెం పోలీసుస్టేషన్, మేడికొండూరు పోలీసుస్టేషన్, నల్లపాడు పోలీసుస్టేషన్, పిడుగురాళ్ల పోలీసుస్టేషన్, కొత్తపేట పోలీసుస్టేషన్, పట్టాభిపురం పోలీసుస్టేషన్, మార్టూరు పోలీసుస్టేషన్ లలో నా మీద ఫలు కేసులు అయ్యాయి, నల్లపాడు పోలీసుస్టేషన్ లో నా మీద రౌడీ షీట్ కూడా ఉన్నదని ఒప్పుకున్నాడనీ. ఆ తర్వాత ఒప్పుకోలు స్వాధీన పంచనామా నిర్వహించి అట్టి స్కూటి, 3 తులాల బంగారపు నాంతాడు ను స్వాధీనపరుచుకొని, నేరస్థున్ని మిర్యాలగూడ సబ్ జైల్ కు జ్యుడీసియల్ రిమాండ్ కు పంపించినట్లు మిర్యాలగూడ సీఐ రాఘవేంద్ర, వన్ టౌన్ ఎస్సై శ్రీనివాస్ నాయక్ తెలిపారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.