ప్రజాలహరి ,జనరల్ డెస్క్,..
చంద్రునిపై కాలుమోపిన చారిత్రక ఘట్టంతో అద్బుతాన్ని ఆవిష్కరించాం. సైన్స్ & టెక్నాలజీ ఆవిష్కరణ స్ఫూర్తితో ప్రతి ఆగస్టు 23ను జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహిస్తాం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శనివారం బెంగళూరులోని ఇస్రో కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ చంద్రయాన్ 3 సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రయాన్ విజయవంతం కావడం దేశం గర్వించదగ్గ విషయమని, శివశక్తి, తిరంగా నామకరణ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష పరిశోధన దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్వాగతం పలికేందుకు వేచి ఉండగా వారు ఉండవద్దని వారు నాకు తన కోసం వెయిట్ చేయొద్దు అని వెళ్ళమని ప్రధానమంత్రి సూచించారు. ప్రధానమంత్రి ఆ నిర్ణయం తీసుకోవడంతో ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రులు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.