మిర్యాలగూడ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న నర్సిరెడ్డి
మిర్యాలగూడ ప్రజాలహరి – నల్లగొండ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి మిర్యాలగూడ కాంగ్రెస్ టికెట్ కోసం టి పి సి సి కి దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన నర్సిరెడ్డి కౌన్సిలర్ గా కొనసాగుతున్నారు. కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో కృషి చేస్తున్నారు. మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని టీ పిసిసి కి దరఖాస్తు చేసుకున్నట్లు నర్సిరెడ్డి తెలిపారు.