రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్…. మంత్రి సబితా ఇంద్రారెడ్డి…
ప్రజాలహరి, జనరల్ డెస్క్…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది .నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా 5 100 ఉద్యోగాలను డీఎస్సీ ద్వారా నింపేందుకు రంగం సిద్ధం చేసిందని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విలేకరులకు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను పటిష్ట పరిచే చర్యలో భాగంగా ఈ నోటిఫికేషన్ సిద్ధమైనట్టు వివరించారు. ఉద్యోగాలు నియమకాలకు సంబంధించిన నోటిఫికేషన్ రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు వివరించారు.